SBI: డాక్యుమెంట్స్, షూరిటీ లేకుండా 50 వేల లోన్ ఆఫర్?

Purushottham Vinay
 బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా  కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ప్రైవేట్ సంస్థల నుంచి కాకుండా గుర్తింపు ఉన్న వాటి నుంచి రుణం తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ కొన్ని బ్యాంకులు లోన్ ఇవ్వాలంటే చాలా డాక్యమెంట్లను కోరుతాయి. కానీ ఎస్బీఐ మాత్రం కొందరికి ఎలాంటి డాక్యుమెంటేషన్, షూరిటీ లేకుండా రూ.50 వేల లోన్ ఆఫర్ ఇస్తోంది. అది ఎలాగో తెలుసుకుందాం.చిరు వ్యాపారం చేసేవారు ఖచ్చితంగా తమ బిజినెస్ ను విస్తరించాలనుకుంటారు. ఇందు కోసం ఇతరుల వద్ద చాలా అప్పులు చేస్తుంటారు. అయితే వ్యాపారం వృద్ధి కాని సమయంలో వీటికి వడ్డీలని కట్టలేకపోతారు. ఇలాంటి వారికి ఎస్బీఐ బ్యాంకు 'శిశు ముద్ర' ద్వారా మంచి లోన్ సదుపాయం కల్పిస్తున్నారు. ఈ పథకం కింద రూ.50 వేలు అందిస్తున్నారు. అంతకంటే ఎక్కువ అంటే రూ.5 లక్షలు కావాలనుకున్న వారికి కిశోర్ ముద్ర ద్వారా లోన్ అందిస్తారు.


ఇక రూ.10 లక్షలు కావాలనుకునేవారికి తురుణ్ ముద్ర ద్వారా సౌకర్యం కల్పిస్తారు.ఇక శిశుముద్ర లోన్ ని పొందాలనుకునేవారికి మినిమం అర్హతలుంటే సరిపోతుంది. అయితే వారు భారతీయ పౌరులై ఉండాలి. ఇంకా అతడు నిర్వహించే బ్యాంకు అకౌంట్ ఖచ్చితంగా 3 సంవత్సాల సీనియారిటీ అయి ఉండాలి. అయితే ఈ లోన్ తీసుకునేవారు ఏదో ఒక వ్యాపారం చేసేవారై ఉండాలి. అది చిరు వ్యాపారమైనా ఒకే. అంతే.. మిగతా ఎలాంటి డాక్యుమెంటేషన్, సూరిటీ లేకుండా లోన్ ని ఇస్తారు. అయితే తీసుకున్న రుణం మొత్తాన్ని కూడా 5 సంవత్సరాలలోపు చెల్లించాలి.ఇక రూ.50 వేల లోన్ కావాలనుకునేవారు ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లి సంబంధిత అధికారులను సంప్రదించాలి. వారు మినిమం ప్రాసెస్ చేసి లోన్ ను వారికి నిమిషాల్లో అందిస్తారు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద వడ్డీలకు తెచ్చి బాధపడే కంటే ఇలా శిశు ముద్ర ద్వారా లోన్ తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. ఈలోన్ సదుపాయం కల్పించినందుకు మొత్తం 12 శాతం వడ్డీ రేటును విధిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: