ట్రాజెడీ: ఏపీలో బతకాలంటే ట్రోల్స్ భరించాల్సిందేనా?

Chakravarthi Kalyan
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత అది మనిషి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. అనేక వ్యవస్థలు, చివరకి దేశాలపై కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు సోషల్ మీడియా దెబ్బకి ఏపీకి చెందని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. చదువుతుంటే విస్మయం అనిపిస్తున్నా ఇది ముమ్మాటికీ నిజం.

నాకు పట్టా వచ్చింది. అమ్మ ఒడి అందుతోంది. ఇంకా చాలా పథకాల ద్వారా లబ్ధి కలుగుతోంది అని ఏపీకి చెందిన గీతాంజలి అనే అమ్మాయి  మీడియాతో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిని వైసీపీ అనుకూలంగా మలచుకొని ప్రచారం చేయగా.. ఓ పార్టీ వ్యతిరేకంగా కామెంట్లు చేయడం ప్రారంభించింది. ఆ కామెంట్లు ఆమె వ్యక్తిగత జీవితం మీద ప్రభావం చూపాయి. దీంతో గీతాంజలి ఆత్మ నూన్యతా భావానికి  లోనైంది. తట్టుకోలేక రెండు రోజుల క్రితం ఆత్యహత్యాయత్నానికి పాల్పడింది.  రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె చివరకు మృతి చెందింది.

దీంతో ఆమె మృతికి కారణం అయిన సోషల్ మీడియాలోనే జస్టిస్ ఫర్ గీతాంజలి అనే హ్యాష్ ట్యాగ్ లతో పోస్టులు పెడుతున్నారు. ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఓ వర్గం పార్టీ నాయకుల, అనుకూల నెటిజన్ల కామెంట్ల వల్లే ఆమె మృతి చెందిందని వైసీపీ మద్దతు దారులు ఆరోపిస్తున్నారు.

ఆత్మహత్యాయత్నానికి కారణాలు ఏమైనప్పటకీ ఆమె మృతి చెందింది అనేది వాస్తవం. ఆమె మరణం వల్ల పిల్లలు తల్లి ప్రేమకు దూరం అయ్యారు. కేవలం సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల ఆమె మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో ఇవి సర్వ సాధారణం అయ్యాయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకరిమీద మరొకరు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా పోస్టులు పెడుతూ వారిని మానసికంగా చంపేస్తున్నారు. ప్రస్తుతం గీతాంజలి విషయంలో జరిగింది అదే. దారుణమైన ట్రోలింగ్ తో ఆమెలో ఆత్మ నూన్యతా భావం క్రియేట్ చేసి మరణానికి కారణం అయ్యారు. చివరకు ఏపీలో ఉండాలంటే ట్రోలింగ్  భరించాల్సిందేనేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: