ఆన్లైన్ ట్రోలింగ్ కి యువతి బలి?

Purushottham Vinay
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ట్రోలింగ్ ఎక్కువ అయిపోయింది. ఫ్యాన్ వార్స్ ఎక్కువ అయిపోయాయి. ఆన్లైన్ ట్రోలింగ్ కి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గీతాంజలి(28) ఆన్లైన్ ట్రోలింగ్ కి గురై ఆత్మహత్యకి గురైన విషయం నెట్టింటా వైరల్ అవుతుంది. గీతాంజలి తన కుటుంబంతో కలిసి తెనాలిలో నివసిస్తుంది. ఆమెకు పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈమధ్య ప్రభుత్వం పథకంలో ఆమెకు ఇల్లు వచ్చింది. ఇంటి పట్టాను ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తీసుకుంది. ఇంటి పట్టా అందుకున్న తర్వాత ఆమె ఆనందంతో మీడియాతో మాట్లాడింది. వైసీపీ ప్రభుత్వం తన కల నెరవేరిందని, తన పిల్లలకు అమ్మ ఒడి వస్తుందని ఆమె చెప్పింది. ఇతర సంక్షేమ పథకాలు కూడా సరిగ్గా అందుతున్నాయని ఆనందంతో చెప్పింది. గీతాంజలి మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజకీయ కారణాలతో వైసీపీ శ్రేణులు ఈ వీడియోను తన ఖాతాల్లో పోస్టు చేయగా... ప్రతిపక్ష పార్టీల అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెని ఘోరంగా ట్రోల్ చేశారు. గీతాంజలి ఆత్మహత్యకు ట్రోలింగ్ కారణమని అనేక వార్తలు వస్తున్నాయి.


 అయితే కేవలం ట్రోలింగ్ మాత్రమే కాదని ఆమెని రాజకీయ లబ్ది కోసమే అధికార రాజకీయ పార్టీ నాయకులు ఆత్మహత్యకు పాల్పడేలా చేసి ఉంటారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఘటనపై పోలీసులు ఇంకా స్పందించాల్సి ఉంది.టీడీపీ, జనసేన శ్రేణుల ట్రోలింగ్ కారణంగానే గీతాంజలి బలవన్మరణానికి పాల్పడిందని వైసీపీ మద్దతుదారులు, కాదు వైసీపీ నాయకులు తమ రాజకీయ లబ్ది కోసం ప్రతి పక్షాలని బ్యాడ్ చెయ్యాలని కావాలనే ఆత్మ హత్యకు పాల్పడేలా చేసి ఉంటారని జనసేన, టీడీపీ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. కారణం ఏదైనా పాపం గీతాంజలి మరణంతో ఆమె పిల్లలు అన్యాయం అయ్యారు. ఆమెకు న్యాయం చేయాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో #JusticeForGeethanjali అని పోస్టులు పెడుతున్నారు. కారణాలు ఏమైనా సరే ట్రోలింగ్ వల్ల మరో మహిళ బలైపోయింది. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల దాకా ఈ సోషల్ మీడియా రక్కసి చేతిలో నిత్యం అనేక రకాల వేధింపులకు గురవుతున్నారు. రాజకీయపరమైన అంశాలతో అకౌంట్స్ క్రియేట్ చేసుకుని పార్టీలపై నిత్యం దుమ్మెత్తిపోసుకుంటున్నారు.అలాగే సినిమా హీరోల ఫ్యాన్స్ కూడా నిత్యం కొట్టుకు చస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: