టిడిపి- బిజెపి- జనసేన పొత్తులపై ఉత్కంఠ..!!
ప్రధానంగా లోక్సభ ఎన్నికలను టార్గెట్ చేసుకుంటూ బిజెపి ఆంధ్రాలో 10 లోక్సభ సీట్లను అడిగినట్లుగా సమాచారం.. గురువారం నుంచి ఇప్పటివరకు ఎన్నోసార్లు చర్చలు జరిపిన ఇప్పటివరకు క్లారిటీ రానట్లు తెలుస్తోంది. అయితే నేడు కేంద్ర మంత్రి అమిత్ షా తో టిడిపి నేత పవన్ కళ్యాణ్ మరొకసారి సమావేశమై పొత్తుల విషయంలో ఖరారు చేయడానికి పలు రకాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గం.. 25 లోకసభ నియోజకవర్గాలు ఉన్నాయి.. అయితే ఇందులో 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాలను బిజెపి పార్టీకి ఇవ్వాలని ప్రాథమికంగా అవగాహనకు వచ్చినట్లు సమాచారం.
ఇక మిగిలిన స్థానాలలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ నిలవబోతోంది. అయితే ఇప్పటికే పొత్తులపై ఇంకా క్లారిటీ రాలేదు ఈరోజుతో అధికారికంగా ప్రకటన వెల్లడించబోతున్నట్లు బిజెపి వర్గాల నుంచి వార్తలైతే వినిపిస్తున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటలకు అమిత్ షా చంద్రబాబు పవన్ మరొకసారి భేటీ అయి అనంతరం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నది.. కేంద్ర ప్రభుత్వం కూడా మళ్లీ అధికారంలోకి రావాలని 400 సీట్లలో గెలవాలని చాలా పట్టుదలతో ఉన్నది.. మరి పొత్తులు ఉంటాయా లేవా అనే విషయం పైన కూడా ఇంకా సందిగ్ధత ఉండడంతో మరి కొన్ని గంటలలో అసలు విషయం తేలబోతోంది. మరి ఈసారి ఎన్నికలలో ఎవరు గెలుస్తారో మరింత ఉత్కంఠంగా మారుతోంది..