టీడీపీ ట్రాప్‌లో వైసీపీ పడుతోందా?

Chakravarthi Kalyan
జగన్ ని గద్దె దించడం. ఇది ఏపీలోని అన్ని రాజకీయ పార్టీల ఆలోచన. ఈ మేరకు కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. తెర వెనుక అవగాహనతో కలిసి పనిచేస్తున్నాయి. అధికార వైసీపీని ఓడించాలంటే ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమానికి మించి అందించాలి. ఈ మేరకు ఇప్పటికే టీడీపీ, జనసేనలు సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నా.. ఆశించిన స్పందన రావడం లేదు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల ప్రజల్లోకి వెళ్లాయి.  ఆ పార్టీ విజయానికి దోహదం అయ్యాయి. కానీ టీడీపీ, జనసేన ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు మాత్రం ఈ విధంగా ప్రజల్లోకి వెళ్లడం లేదు. దీంతో సెంటిమెంట్ ను రగల్చే ప్రయత్నం చేస్తున్నాయి. జగన్ మళ్లీ అధికారంలోకి రాకూడదు అనే ఆలోచన ప్రజల్లో కలగాలి. ఇప్పుడు ఎవరు అధికారంలోకి వచ్చిన సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయి.. ఇవి ఆగవు అని ఏపీ ప్రజలు భావిస్తున్నారు.

అందుకే జగన్ ఉంటే ప్రమాదం అనే అంశాన్ని ప్రజల్లో తీసుకెళ్తన్నారు.  దీనికోసం పలు ఎత్తుగడలను వేస్తున్నారు. తాజాగా జరిగిన ఓ సంఘటనను పరిశీలిస్తే.. అనంతపురం జిల్లా రాప్తాడు లో ఖాళీగా ఉన్న స్థలంలో కొంతమంది గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. అందరికీ జగనన్న కాలనీలు పేరుమీద ప్రతి గ్రామంలో ఇళ్ల స్థలాలు అందజేసి ఇళ్లు కట్టిస్తుంటే వారికి ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది.

నిరుపేదలు అనే పేరుతో కమ్యూనిస్టులతో కలిసి ఓ ఖాళీ స్థలంలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. అవి వైసీపీ కి చెందిన నేతల స్థలాలు కావొచ్చు. వాళ్లు ఏమో వీటిని తీసేయించారు. దీంతో వైసీపీ నేతల దౌర్జన్యాలు అంటూ ప్రచారం చేస్తున్నారు. సీపీఐ, సీపీఎం లు ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నా.. అంతర్గతంగా చంద్రబాబు చెప్పు చేతుల్లో ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. తిరుపతిలో హథీరామ్ మఠానికి సంబంధించిది కూడా ఇలానే జరిగింది. ప్రస్తుతం ఈ సమయంలో ఇలా చేయడం టీడీపీ ట్రాప్ లో వైసీపీ నేతలు పడటమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: