కమ్మల పార్టీ అంటే ఒక్క తెలుగుదేశమేనా?

Chakravarthi Kalyan
రాబోయే సార్వత్రిక ఎన్నికలను అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచి చావోరేవో అనే రీతిలో పోరాడుతున్నాయి.  ఈ క్రమంలో పోటాపోటీగా అభ్యర్థులను బరిలో దించుతున్నారు. వైసీపీని తీసుకుంటే కీలకమైన ప్రయోగానికి తెరతీసింది. బీసీలకు పెద్ద పీట వేస్తున్నామంటూ.. చాలా వరకు నియోజకవర్గాల్లో బీసీలను సమన్వయ కర్తలుగా నియమించింది. తద్వారా టీడీపీ ఓటు బ్యాంకు కు గండిపెట్టవచ్చని వైసీపీ భావిస్తోంది.

టీడీపీ చరిత్రలోనే తొలిసారిగా ఇంతమంది అభ్యర్థులను అది కూడా ఎన్నికలకు ముందు షెడ్యూల్ వెలువడక ముందే ప్రకటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఒకేసారి 94మంది అభ్యర్థుల జాబితా విడుదల చేసి చంద్రబాబు సీఎం జగన్ కు సవాల్ విసిరారనిఅంటున్నారు.   ఓ వైపు జగన్ ఓసీ స్థానాల్లో కూడా బీసీలను నిలబెడుతుంటే.. చంద్రబాబు మాత్రం తాను ప్రకటించిన తొలి జాబితాలో తన సామాజిక వర్గం కమ్మనేతలకు ప్రాధాన్యం ఇచ్చారు.

94 మంది అభ్యర్థుల్లో 21 సీట్లను కమ్మ సామాజిక వర్గానికి కేటాయిస్తూ జాబితా విడుదల చేశారు. జనసేనతో కలుపుకొంటే ఈ సంఖ్య 22కి చేరింది. వీరి తర్వాత రెడ్లకు అత్యధిక స్థానాలు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రారంభంలో కమ్మ సామాజిక  వర్గ నేతలు అన్ని పార్టీల్లో ఉంటూ అందర్నీ కలుపుకొని వెళ్లేవారు. కొన్నాళ్లకు ఎల్లో మీడియా, తదితర కారణాలతో టీడీపీ మాత్రమే తమ పార్టీ అనే భావనను కమ్మ సామాజిక వర్గ యువతలో వీళ్లు కల్పించారు.

సీఎంగా వైఎస్సార్ ఉన్న సమయంలో కమ్మ లకు మంచి పదవులు కట్టబెట్టినా వారంతా తిరిగి చంద్రబాబు వద్దకే చేరారు. దీంతో ఆయన ఆ సామాజిక వర్గంపై గుర్రుగా ఉండేవారు. జగన్ మాత్రం తనకు విధేయులుగా ఉండేవారిని ఏ విధంగా దగ్గరికి తీసుకుంటారో కొడాలి నాని, రఘురాం వంటి నేతలను చూస్తే అర్థం అవుతుంది. ఎంత ఇచ్చినా కొంతమంది కులం వైపే చూస్తారు అని చెప్పడానికి సాక్ష్యం రాష్ట్ర కమ్మ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్. ఆయన తన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.  దీంతో కమ్మనేతలంటే టీడీపీయే అనేచర్చ మరోసారి మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: