జనసేన సీట్లను ప్రకటించిన వెంటనే కుక్క ఫోటోని షేర్ చేసిన పూనమ్ కౌర్..!!

Divya
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే అందరికీ ఆసక్తి కరిపించేలా అవుతున్నాయి. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఆంధ్రాలో రోజుకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా మారుతోందని చెప్పవచ్చు. ఒకవైపు అధికార పార్టీ వైసిపి మరొకవైపు టిడిపి జనసేన కూటమితో ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు.ఈ క్రమంలోనే అన్ని పార్టీల నేతలు కూడా బిజీగా మారుతున్నారు. ఇదంతా ఇలా ఉండగా జనసేన టిడిపి కూటమితో ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేశారు. ఈ జాబితాలో దాదాపుగా 94 మంది టీడీపీ అభ్యర్థులు జనసేన అభ్యర్థులు 24 మంది ప్రకటించారు.
దీంతో సోషల్ మీడియాలో చాలా దారుణమైన ట్రోల్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ మాత్రం సీట్ల కోసం పార్టీలు ఎందుకు పెట్టాలి అంటూ కూడా ఎద్దేవా చేస్తున్నారు. ముఖ్యంగా టిడిపి తో పొత్తు విషయం పైన చాలా మంది పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ ఉన్నారు.. ఇప్పుడు తాజాగా హీరోయిన్ పూనమ్ కౌర్ .. కూడా సోషల్ మీడియా వేదికగా ఒక షాకింగ్ పోస్టుని షేర్ చేయడం జరిగింది.ముఖ్యంగా టిడిపి సీట్ల ప్రకటించగానే ఈ కుక్క ఫోటోని తన ట్విట్టర్లో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ..

పాత సినిమాలో హీరోయిన్ శ్రీదేవి కుక్కను ఆడిస్తూ ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేస్తే అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో వైసీపీలో భారీగా ఈ ఫోటోని షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ పైన ట్రోల్ చేస్తున్నారు.. పూనం కౌ టైం కి కుక్కని వదిలింది అంటూ ఈ పోస్ట్ పైన కామెంట్లు చేస్తున్నారు.. అయితే గత కొన్నేళ్లుగా అటు పూనమ్ కౌర్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ మధ్య ఏదో విభేదాలు ఉన్నాయని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.. ఇప్పటివరకు ఈ విషయం పైన ఎవరూ కూడా స్పందించలేదు. కానీ అప్పుడప్పుడు పూనామ్ కౌర్ ట్వీట్ చూస్తే అందరిని ఆశ్చర్యానికి గురయ్యాలా చేస్తూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: