చంద్రబాబుతో పొత్తుపై అమిత్‌షా సర్వే?

Chakravarthi Kalyan
బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీ, జనసేన పార్టీలు గంపెడు ఆశలతో ఉన్నారు. ఏపీలో ఆ పార్టీకి పెద్దగా బలం లేకపోయినా కేంద్రంలో మరోసారి బీజేపీ వచ్చే అవకాశం ఉండటంతో  ఆ పార్టీ పెద్దల ఆశీస్సులు ఉంటే తమకు అన్ని విధాలా కలిసి వస్తుందని ఆ పార్టీలు భావిస్తున్నాయి. అలాగే ఎన్నికల సమయంలోను బీజేపీ సహకారం తప్పనిసరిగా కావాల్సిందేనని అప్పుడే అధికార వైసీపీని సమర్థంగా ఎదుర్కోగలమని ఇరు పార్టీలు భావిస్తున్నాయి.

అందుకే చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం తెగ తాపత్రయపడుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిశారు. తాజాగ ఈ పొత్తుల వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. బీజేపీతో పొత్తు కోసం చివాట్లు తిన్నానని వ్యాఖ్యానించారు. అయితే టీడీపీ, బీజేపీ నుంచి ఈ పొత్తు వ్యవహారపై ఎటువంటి ప్రకటన రావడం లేదు. చర్చల్లో పురోగతి కనిపించడం లేదు.

అయితే చంద్రబాబు  ఆపార్టీ అధిష్ఠానం ముందు ఒక ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. 30 అసెంబ్లీ స్థానాలు, 10 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఇందులో బీజేపీకి 5 అసెంబ్లీ స్థానాలు, ఏడు ఎంపీ సీట్లు, జనసేనకు 25 అసెంబ్లీ స్థానాలు, మూడు ఎంపీలు ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు రాజకీయ వర్గాల ద్వారా వినిపిస్తోంది. దీనికి అటూ ఇటూగా ఏదైనా మార్పులు కూడా జరగొచ్చు.

పార్లమెంట్ స్థానాలు ఎక్కువ కోరుకుంటున్న బీజేపీ, అసెంబ్లీ స్థానాల్లో కూడా పట్టుబడుతున్నట్లుగా కనిపిస్తోంది.  ఈ విషయమై మరోసారి చర్చల్లో స్పష్టత రానుంది. ఇప్పటికే అమిత్ షా ఏపీపై దృష్టిసారించారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన ఓ సర్వే చేయిస్తున్నారని. తెలిపాయి.  ఎన్ని సీట్లలో పోటీచేస్తే కాషాయ పార్టీకి లాభం అనే విషయం గురించి అంటే ఆరు సీట్లలో పోటీచేస్తే పరిస్థితి.. ఎనిమిది చోట్ల పోటీచేస్తే పార్టీ గ్రాఫ్ ఇలా పలు కోణాల్లో సర్వే చేయిస్తున్నారట.  మూడు పార్టీలు కలసి పోటీచేస్తే ఎన్నిస్థానాల్లో బీజేపీ గెలవగలుగుతుంది అనే విషయంపై అమిత్ షా పర్సనల్ టీం క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: