ఆంధ్రాలో ఎవరు గెలవాలో తేల్చేది వాళ్లేనా?

Chakravarthi Kalyan
ఏపీలో సరిగ్గా రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు అనే దగ్గరి నుంచి మన కళ్లముందే కనపడే స్జేజీ వరకు వచ్చేశాయి. రాబోయే ఈ కొద్ది రోజులు అన్ని పార్టీలకు అత్యంత కీలకమైనవి. ఏపీలో ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ కూటమి మధ్యే.  కాకపోతే అనూహ్యంగా వచ్చిన కాంగ్రెస్ సంబంధిత ఇండియా కూటమి ఎవరి ఓట్లు చీలుస్తుంది అనే దానిపైనే ఆయా పార్టీల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.

ఇండియా కూటమిలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఆమ్ ఆద్మీ, జై భారత్ లాంటి పార్టీలు ఉన్నాయి. మొత్తంగా అయితే  ఈ కూటమికి గెలిచే పరిస్థితి లేదు. కానీ విజయాన్ని మాత్రం నిర్ణయిస్తారు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో బయపడని అభ్యర్థులతో పాటు కొన్ని చోట్ల ప్రధాన పార్టీ అభ్యర్థుల విజయాన్ని ఈ కూటమి నిర్దేశిస్తోంది.

అయితే ఈ కూటమి ఎవరి ఓట్లు చీలుస్తుందో చెప్పలేం కానీ.. ప్రభావం మాత్రం బాగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఏది ఏమైనా ఈ సారి ఆంధ్రాలో నెక్ టు నెక్ ఫైట్ జరిగేలా ఉంది. ఎందుకంటే 2014లో ప్రజలు టీడీపీకి అవకాశం ఇద్దామని భావించారు. వందకు పైగా సీట్లలో టీడీపీ అభ్యర్థులను గెలిపించి స్పష్టమైన తీర్పు ఇచ్చారు. 2019లో అయితే జగన్ మోహన్ రెడ్డిని బంపర్ మెజార్టీతో గెలిపించి సీఎం సీటులో కూర్చోబెట్టారు.

ఈసారి మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. కాకపోతే సంకీర్ణంగా కాకుండా సింగిల్ గానే అధికారానికి కావాల్సిన సీట్లను సాధించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకు తమ పార్టీ అభ్యర్థులను 140 పైగా స్థానాల్లో బరిలో దింపేందుకు యత్నిస్తున్నారు. మిగతా సీట్లను బీజేపీ, జనసేనకు కేటాయిస్తే అందులో వారు 15-20 గెలిచినా తమ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదని చంద్రబాబు భావిస్తున్నారు. కానీ తమ మద్దతుతో టీడీపీ కూటమి అధికారంలోకి రావాలని జనసేన, బీజేపీ భావిస్తున్నాయి. ఇది ప్రస్తుతం జరగుతున్న తంతు. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: