టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి?

Purushottham Vinay
వైసీపీ పెనమలూరు ఎమ్మెల్యే అయిన పార్థసారధి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.ఇక ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఈ నెల 26 వ తేదీన ప్రార్థసారధి తెలుగుదేశం పార్టీ కండువాని కప్పుకోనున్నారు.ఆ రోజు నూజివీడుకు చంద్రబాబు నాయుడు వెళ్లే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్థసారధితో పాటు ఇతర నేతలు కూడా తెలుగు దేశం పార్టీలో చేరనున్నారు. పార్థసారధి బరిలోకి దిగే నియోజకవర్గాన్ని కూడా తెలుగు దేశం పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలిసింది. నూజివీడు నియోజకవర్గం నుంచి తెలుగు దేశం పార్టీ యొక్క అభ్యర్థిగా పార్థసారధి బరిలోకి దిగనున్నారు.ఇక ఏలూరు జిల్లా న్యూజివీడు తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా పార్థసారధి దాదాపు ఖరారు కావడంతో నూజివీడు పట్టణంలో ప్లెక్సీలు వెలిశాయి. పార్థసారధికి స్వాగతం పలుకుతూ కొంతమంది ప్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.కృష్ణా జిల్లాలోని పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న పార్థసారధికి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సీటు కేటాయించలేదు. ఇక ఆ నియోజకవర్గం నుంచి మంత్రి జోగి రమేశ్ బరిలోకి దిగనున్నారు. పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జిగా జోగి రమేశ్ ను జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు.



అంతకుముందు నుంచే వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థ సారధి పార్టీ వీడేందుకు రెడీ అయ్యారు. గత నెల రోజుల నుంచి ఆయన వైసీపీ వీడి తెలుగు దేశం పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది.అయితే, తెలుగు దేశం పార్టీలోకి వెళ్తే ఏ నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తారనే విషయంపై క్లారిటీ లేకపోవటంతో ఇన్ని రోజులు టీడీపీలో చేరికను పార్ధసారధి వాయిదా వేసుకుంటూ వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది.చంద్రబాబు నాయుడు తాజాగా పార్థసారధి ఎన్నికల బరిలోకి దిగే నియోజకవర్గంపై క్లారిటీ ఇవ్వడంతో ఆయన టీడీపీలో చేరికకు ముహూర్తం ఖారారు చేసుకున్నారు.ఈ నెల 26 వ తేదీన నూజివీడులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్ధసారధి, ఆయన వర్గీయులు తెలుగు దేశం పార్టీలో చేరనున్నారు.నూజివీడు నుంచే ఆయన మరో రెండు మూడు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నిల్లో తెలుగు దేశం అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఈ విషయంపై చంద్రబాబు నాయుడు నుంచి స్పష్టత వచ్చినట్లు పార్ధసారధి వర్గీయులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: