దొంగఓట్ల స్కామ్‌తో జగన్‌కు అప్రదిష్ట?

Chakravarthi Kalyan
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సమయంలో తిరుపతిలో దొంగ ఓట్ల కలకలం రేపిన విషయం తెలిసిందే. ఎవరూ లేని ఇంట్లో పదుల సంఖ్యలో ఓట్లు నమోదు అయ్యాయి. చనిపోయిన వారికి సైతం ఓటు హక్కు కల్పించారు. అంతేకాదు డిగ్రీ అర్హత లేకున్నా పట్టభద్రు ఎన్నికల్లో ఓటు నమోదు చేశారు. దీంతో టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

దీంతో పాటు వైసీపీ నేతలు కూడా అక్రమ ఓటర్లను తొలగించాలని ఈసీకి పోటాపోటీగా ఫిర్యాదు చేశారు. దీంతో ఎవరి హయాంలో దొంగ ఓట్లు నమోదు అయ్యాయో అర్థం కాక ఏపీ ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. అయితే చంద్రబాబు హయాంలో దొంగ ఓట్లు నమోదు జరగలేదా అంటే కచ్ఛితంగా లేదు అని చెప్పలేం. ఇప్పుడు వైసీపీ హయాంలో కూడా జరుగుతుంది అదే. కాకపోతే ఇద్దరు చేసింది తప్పే. కాకపోతే చంద్రబాబు సమయంలో వెంటపడి మరీ విచారణ చేపట్టాలని అప్పుడు జగన్ కోరలేదు.

కానీ ఇప్పుడు టీడీపీ నేతలు ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదులు చేస్తుండటంతో వరుస పెట్టి అధికారులను సస్పెండ్ చేస్తున్నారు. కొంతమందిని బదిలీ చేస్తున్నారు. దీంతో పాటు శాఖా పరమైన దర్యాప్తులు జరుపుతున్నారు. తిరుపతిలో సులభంగా గెలుస్తారు అని తెలిసి కూడా వైసీపీ అక్రమాలకు తెరలేపింది. ఓటరు ఐడీ లు డౌన్ లోడ్ చేసి చేయించిన నేరం ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ వెలుగు చూడలేదు.

అలా చేయించిన స్థానిక నేతలు అక్కడ హీరోలుగా చెలామణీ అవుతున్నారు. సాధారణంగా ఇతర రాష్ట్రాల్లో అంటే తెలంగాణ, కర్ణాటక లో ఓట్లు కలిగి తిరిగి ఏపీ లో కూడా ఓటు హక్కు కలిగిన వారు చాలామందే ఉన్నారు. వీరి ఓటు తొలగించే సాహసం అప్పుడు టీడీపీ, ఇప్పుడు వైసీపీ చేయలేకపోతోంది. కారణం తమ ఓటు బ్యాంకు కు గండిపడుతుందనే ఉద్దేశంతో. కాకపోతే అప్పటిలాగే లైట్ తీసుకుంటారని జగన్ భావించినా టీడీపీ వెంటాడీ మరీ ఆధారాలు చూపిస్తుండటంతో జగన్ సర్కారు అభాసుపాలవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: