అమరావతి : చరిత్రలో మొదటిసారి టీడీపీ ఖాళీ

Vijaya

తెలుగుదేశంపార్టీ చరిత్రలో మొదటిసారి అంటే గడచిన 41 ఏళ్ళల్లో రాజ్యసభలో ఖాళీ అవబోతోంది. ఏప్రిల్ 2వ తేదీన రాజ్యసభ ఎంపీల ఎన్నికను కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్వహించబోతోంది. ఖాళీ అవుతున్న స్ధానాల్లో ఏపీ కోటాలో మూడున్నాయి. వీటికి ఈనెల 15 నామినేషన్ వేయటానికి ఆఖరుతేది. 27వ తేదీన ఎన్నిక జరగబోతోంది. వైసీపీ తరపున ముగ్గురు నేతలు వైవీ సుబ్బారెడ్డి, మేడా రాఘవరెడ్డి, గొల్లబాబూరావును జగన్మోహన్ రెడ్డి ఎంపికచేశారు.



వీరి ముగ్గురికి జగన్ బీపారాలు కూడా అందించారు. ఒకటి రెండు రోజుల్లో వీళ్ళు నామినేషన్ వేయటం ఖాయం. సరే వీళ్ళ విషయాన్ని వదిలేస్తే మరి చంద్రబాబునాయుడు ఏమిచేయబోతున్నారు ? టీడీపీ తరపున ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై ఆమధ్య చర్చలు కూడా జరిగాయి.  మొదట్లో ఎస్సీ నేత వర్ల రామయ్య పేరు ప్రచారంలోకి వచ్చినా తర్వాత కంభంపాటి రామ్మోహన్ రావు పేరు వినబడింది. అయితే గడచిన నాలుగురోజులుగా ఎవరిపేరు వినబడటంలేదు.



నామినేషన్ వేయాల్సిన తేదీ దగ్గరకు వస్తున్న నేపధ్యంలో టీడీపీ నుండి ఎలాంటి సౌండ్ లేకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. నిజానికి అభ్యర్ధిని  పోటీపెట్టి గెలిపిచుకునేంత సీన్ టీడీపీకి లేదు. ఎందుకంటే తమ అభ్యర్ధికి పడాల్సినన్ని ఓట్లు టీడీపీకి లేవు. రాజ్యసభకు పోటీపడుతున్న  ఎంపీ అభ్యర్ధికి 43 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాల్సుంటుంది. వైసీపీ తరపున గెలిచిన 151 మంది ఎంఎల్ఏల్లో  ముగ్గురికి 129 మంది ఓట్లేయటానికి సరిపోతారు.



అదే టీడీపీని తీసుకుంటే ఉన్నదే 22 మంది ఎంఎల్ఏలు. అభ్యర్ధిని గెలిపించుకోవాలంటే ఇంకా 21 మంది ఎంఎల్ఏల బలం అవసరం. అంతమందిని ఎక్కడినుండి తెస్తారు ? వైసీపీ నుండి లాక్కోవాల్సిందే అని ఆలోచించారు. అంతమందిని ఒకేసారి లాక్కోవాలంటే అంత ఈజీకాదు. జనరల్ ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రయత్నంచేసి భంపడితే చాలా అవమానంగా ఉంటుంది. దీని ప్రభావం రాబోయే ఎన్నికలపైనా పడే అవకాశముంది. అందుకనే అన్నీ ఆలోచించి మౌనంగా ఉండటమే మేలని అనుకున్నారట. అంటే రాజ్యసభలో టీడీపీ గొంతు వినిపించే వాళ్ళే ఉండరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: