జగన్, మోదీ భేటీ అసలు రహస్యం ఇదేనా?

Chakravarthi Kalyan
బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు ఆది నుంచి అనుకుంటునే ఉన్నారు. బీజేపీ అగ్రనేతల నుంచి పిలుపు రావడంతో వెంటనే ఆయన దిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి అమిత్ షా,  ఆ పార్జీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. ఎన్డీయేలో టీడీపీ చేరిక.. ఏపీలో పొత్తు, సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై చర్చించారు. చంద్రబాబు రాజకీయంగానే దిల్లీ వెళ్లి చర్చలు జరిపారు.

కానీ వెంటనే రాష్ట్ర సమస్యల పేరిట సీఎం జగన్ ప్రధాని మోదీని కలిశారు. అయితే జగన్ కూడా ఎన్డీయేలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరగుతోంది. అయితే జగన్ ఎన్డీయే  చేరిక విషయంలో అంతటి సాహసం చేస్తారా అనేది ప్రశ్నగా మారింది. ఎందుకంటే రాజకీయ సిద్ధాంతాలు, ఓటు బ్యాంకు పరంగా చూస్తే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే పని కాదు. ముస్లిం, మైనార్టీలు, క్రిష్టియన్లు, దళితులు వైసీపీ ప్రధాన ఓటు బ్యాంకు. ఆయా వర్గాలు బీజేపీని వ్యతిరేకిస్తున్నాయి. జగన్ బీజేపీ వైపు వెళ్తే ఆ వర్గాల్లోని మెజార్టీ ఓటు బ్యాంకు వేరే పార్టీకి మళ్లే అవకాశం ఉంది. ఈ విషయం జగన్ కు కూడా తెలుసు.

కాకపోతే జగన్ ఈ సారి బీసీ నినాదంతో ఎన్నికలకు వెళ్తున్నారు. మోదీ కి కూడా ఓబీసీ వర్గాల మద్దతు ఉంది. ఒకవేళ ఇద్దరూ కలిస్తే తిరుగుండదు కానీ అంత సాహసం చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ రాజకీయ కోణం ఏదైనా అయితే వెంటనే జగన్ అమిత్ షా తోనూ.. లేక జేపీ నడ్డాతోను భేటీ అయిండేవారు. కానీ ఇలా జరగలేదు. పోలవరం నిధుల కోసమే అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం లెక్కల ప్రకారం పునరావాసం నిధులు రూ.9వేల కోట్లు. కానీ రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం అవి అదనంగా రూ.14వేల కోట్లు. ఈ అదనపు నిధులను మంజూరు చేయాలని ప్రధాని మోదీ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలిశారు అనేది వైసీపీ వాదన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: