జీన్స్ అనుమతిస్తే.. తర్వాత పైజామా కూడా వేసుకొస్తారు : కోర్టు

praveen
సాధారణంగా కోర్టులో విచారణకు హాజరయ్యే న్యాయవాదులు ఎలాంటి డ్రెస్ కోడ్ ను పాటించాలి అనే విషయంపై గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతూనే వస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే గతంలో ఒక న్యాయవాది ఏకంగా కోర్టుకు జీన్స్ ధరించి రావడంతో న్యాయమూర్తి ఆ న్యాయవాదిని మందలించడంతో ఈ చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే ఇక కోర్టులోకి న్యాయవాదులు జీన్స్ వేసుకొచ్చేలా అనుమతి ఇవ్వాలి అంటూ కొంతమంది లాయర్లు డిమాండ్ చేయడం కూడా జరిగింది.

 అయితే ఇలా జీన్స్ ధరించి ఏకంగా కోర్టుకు వెళ్లడానికి సమర్థించిన లాయర్ బీజన్ కుమార్ ను గుహవాటి హైకోర్టు నిలదీసింది. హైకోర్టు నిబంధనల ప్రకారం జీన్స్ కి స్పష్టంగా మినహాయింపు లేదు అంటూ బీజన్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే సాధారణంగా లాయర్లు లోపల తెల్ల డ్రెస్ వేసుకొని పైన నల్లకోటు వేసుకొని కనిపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి డ్రెస్ కోడ్ చూడగానే అక్కడ ఉన్నది లాయర్లు అన్న విషయాన్ని టక్కున గుర్తుకు పట్టేస్తూ ఉంటారు అందరూ. కానీ ఇప్పటివరకు ఎవరు కూడా ఏకంగా జీన్స్ వేసుకొని కనిపించలేదు అని చెప్పాలి. కానీ ఇటీవలే ఒక న్యాయవాది  ఇలా జీన్స్ వేసుకొని కోర్టుకు వెళ్లడం సంచలనంగా మారింది.

 ఇక ఇదే విషయంపై లాయర్ బీజన్ కుమార్ సైతం సమర్ధించడం గమనార్హం. అయితే ఇలా లాయర్లు అందరూ కూడా కోర్టుకి జీన్స్ వేసుకొని వచ్చేలా అనుమతి ఇవ్వాలి అంటూ దరఖాస్తు చేసుకున్నాడు బిజయ్ కుమార్. అయితే ఇక బిజన్ కుమార్ దరఖాస్తును తోసి పూచ్చింది గువాహాటి కోర్టు. జీన్స్ కి అనుమతిస్తే తర్వాత ఆడవాళ్లు పైజామా వేసుకోస్తాము అనే డిమాండ్ తీసుకువస్తారు అంటూ జస్టిస్ కళ్యాణ్ రాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే గతంలో తమిళనాడు అండ్ పుదుచ్చేరి బార్ కౌన్సిల్ ఇదే విషయంపై లాయర్లు అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: