అమరావతి : ఢిల్లీలో చంద్రబాబు ఫెయిలయ్యారా ?

Vijaya

పొత్తు చర్చల కోసం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు తన ప్రయత్నంలో ఫెయిలయ్యారా ? అవుననే అంటోంది జగన్ మీడియా. రాబోయే ఎన్నికల్లో బీజేపీతో ఎలాగైనా సరే పొత్తు పెట్టుకోవాల్సిందే అని చంద్రబాబునాయుడు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఇంతకాలం చర్చల కోసం చంద్రబాబుకు కేంద్రం పెద్దలు అసలు అవకాశం కూడా ఇవ్వలేదు. అలాంటిది ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా బీజేపీ పెద్దల మనసు మారిందో లేకపోతే చంద్రబాబు ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయో తెలీదు.



మొత్తానికి ఎవరు ఫోన్ చేస్తే ఎవరు మాటాడారో కాని ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా ను కలిసింది మాత్రం చంద్రబాబు. కాబట్టి చంద్రబాబు తరపున రాయబారం జరిగితేనే మాట్లాడేందుకు రమ్మని అమిత్ కబురుచేసుంటారని అర్ధమవుతోంది. అయితే దీన్ని ఎల్లోమీడియా రివర్సులో చెబుతోంది. చంద్రబాబుతో పొత్తుకోసం బీజేపీ పెద్దలే ప్రయత్నిస్తున్నారంటు కలరింగ్ ఇచ్చుకుంటోంది. చంద్రబాబుతో అవసరమైతే అమిత్ షా  వస్తారు కాని చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు ప్రత్యేక విమానం వేసుకుని ఎగురుకుంటు పోతారు ?



ఇక్కడ విషయం ఏమిటంటే చంద్రబాబుతోనే బీజేపీకి అవసరముంది కాని బీజేపీతో అవసరం చంద్రబాబుకు లేదని ఎల్లోమీడియా టముకువేస్తోంది. సరే విషయం ఏదైనా కానీండి అమిత్-చంద్రబాబు భేటీ జరిగింది. దాదాపు 50 నిముషాల పాటు జరిగిన చర్చల్లో ఏమీ తేలలేదని సమాచారం. చర్చలు ఏమి జరిగాయో తెలీదు కాని సారంసం అయితే చంద్రబాబుకు అనుకూలంగా లేవని మాత్రం అర్ధమవుతోంది.



ఎలాగంటే టీడీపీకి ఏమాత్రం అనుకూలంగా ఉన్నా ఎల్లోమీడియా రెచ్చిపోయేదే అనటంలో సందేహంలేదు. చర్చల సారంశాన్ని కథలు కథలుగా పేజీలకు పేజీలు వర్ణిస్తు రాసుండేవే అనటంలో సందేహంలేదు. పైగా అమిత్ తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడకుండా చంద్రబాబు వెళ్ళిపోయారు. మీడియాతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేని చంద్రబాబు మొహంతిప్పుకుని వెళిపోయారంటే ఏమిటర్ధం ? వాళ్ళమధ్య ఏమి జరిగిందో తెలీదు కాని అర్జంటుగా చంద్రబాబు పార్టనర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్  ఢిల్లీకి వెళ్ళారు. విషయం ఏదైనా చంద్రబాబుకు మద్దతుగానే పవన్ మాట్లాడుతారని అందరికీ తెలిసిందే. మరి ఏమి జరుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: