వసంత కృష్ణ ప్రసాద్: వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్?

Purushottham Vinay
ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే అయిన వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడేందుకు రెడీ అయ్యారు. నిన్న తన అనుచరులతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన వసంత కృష్ణ ప్రసాద్..ఈ రోజు కూడా తన అనుచరులతో సమాశమై తన భవిష్యత్ కార్యాచరణని ప్రకటించనున్నారు. స్థానికంగా పార్టీలో అంతర్గత సమస్యల కారణం చేత పలు సార్లు ఆయన తన అసంతృప్తిని బాహాటంగానే వెల్లగక్కారు. ఈమధ్య దెందులూరులో జరిగిన సిద్ధం సభకు కూడా వసంత కృష్ణప్రసాద్ హాజరుకాలేదు. ఇక అక్కడ ఇంచార్జిగా ఉన్న తిరుమల యాదవ్ ను మైలవరం అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం ప్రకటించడం జరిగింది.ఇక వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. అయితే, మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలనేవి జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి మైలవరం నుంచి పోటీ చేసేందుకు రెడీ అయిన వసంత కృష్ణ ప్రసాద్ కు వైసీపీ అధిష్టానం షాకిచ్చింది. టికెట్ ఇచ్చేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి నిరాకరించారు. అయితే వసంత స్థానంలో మైలవరం నుంచి తిరుమల యాదవ్ పోటీ చేయబోతున్నారు. దీంతో వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అందుకే ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు.



ఈ క్రమంలో ఆదివారం నాడు నియోజకవర్గంలో తన అనుచరులతో సమావేశం అయ్యారు. తాజాగా సోమవారం నాడు తన నివాసంలో నియోజకవర్గంలో ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. ఈరోజు సాయంత్రం దాకా తన భవిష్యత్ కార్యాచరణను వసంత కృష్ణ ప్రసాద్ ప్రకటించనున్నట్లు సమాచారం తెలుస్తోంది.ఇదిలా ఉంటే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన వెంట ఎంత మంది వెళ్తారు.. వైసీపీని ఎంతమంది వీడబోతున్నారు అనే అంశం నియోజకవర్గంలో చాలా ఉత్కంఠగా మారింది. వసంత నిర్వహించిన సమావేశంకు పీఏసీఎస్ అధ్యక్షులు, నియోజకవర్గంలోని మరికొంతమంది ముఖ్యనేతలు హాజరయ్యారు.ఈ విషయం తెలుసుకున్న అధిష్టానం వసంత సమావేశంకు హాజరైన దాదాపు 25 మంది పీఏసీఎస్ అధ్యక్షులపై వేటు వేసింది. పీఏసీఎస్ అధ్యక్షుల పదవీ కాలం జనవరి 31 వ తేదీతో పూర్తయింది.. అయితే, వారి పదవీ కాలంను పొడగించేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్న క్రమంలో వసంత కృష్ణ ప్రసాద్ మీటింగ్ కు హాజరు కావడంతో వారిపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: