అందుకే జగన్‌.. మాగుంటకు టికెట్‌ ఇవ్వట్లేదా?

Chakravarthi Kalyan
టీడీపీ, జనసేనతో కలసి పోటీ చేస్తామని ఆశలు పెట్టుకున్న కొంతమంది బీజేపీ నేతల ఆశలు అడియాసలయినట్లే కనిపిస్తోంది. అన్ని జిల్లాల్లోను ఎన్నికల ఆఫీసులు ప్రారంభించాలని ఆ పార్టీ నేతలకు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని పార్లమెంట్ పరిధిలోని అన్ని జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలను ప్రారంభిస్తున్నారు.

అయితే బీజేపీ నుంచి వస్తున్న సిగ్నల్స్.. ఇతర కారణాల వల్ల టీడీపీ, జనసేన అంతర్గతంగా సీట్లను సర్దుబాటు చేసుకున్నా అధికారికంగా ప్రకటించలేకపోతున్నారు. ఒకవేళ బీజేపీ కూటమిలోకి వస్తే ఆ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలి అనే అంశంపైనే టీడీపీ, జనసేన సీట్ల సంఖ్య ఆధారపడి ఉంది.  అయితే టీడీపీతో మిత్ర పక్షంగా బీజేపీ ఉంటుంది అనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఆ పార్టీపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేయలేదు. 2018 ఎన్నికల సమయంలో బీజేపీపై ఏ విధంగా విషం చిమ్మారో మనం గమనించాం.

అయితే తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి తిరిగి ఒంగోలు టికెట్ ఇవ్వడం లేదనే ప్రచారం జరగతోంది. ఆయన టీడీపీ వైపు చూస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు బీజేపీ కూడా టీడీపీ, జనసేనతో జట్టు కట్టేందుకు సిద్ధంగా లేదు అనే భావన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో గతంలో లిక్కర్ స్కాం కేసులో మాగుంట పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ ఇప్పుడు దాన్ని అంతా పక్కదోవ పట్టించి ఆ నెపాన్ని బీజేపీపై కి నెడదాం అని చూస్తున్నారు.

దిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట తండ్రి కొడుకుల పేర్లు ఉన్నాయి. కానీ తండ్రిని అరెస్టు చేయలేదు. కుమారుడిని చేశారు. ఆయన చాలాకాలం జైలులో ఉండి అప్రూవర్ గా మారి బెయిల్ తెచ్చుకున్నారు. మరోవైపు పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయానికి ఎంపీ మాగుంట ఆర్థిక సాయం అందించారని చెబుతున్నారు.  అక్కడ బీజేపీ ఓడిపోవడంతో ఆ కోపంతో బీజేపీ పెద్దలు జగన్ కు మాగుంటకు టికెట్ ఇవ్వొద్దని చెప్పారని.. అందుకే జగన్ ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వడానికి నిరాకరించారని ఎల్లో మీడియా రాసుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: