వైసిపి ట్రాప్ లో తెలుగుదేశం.. అంతా కాపీనేనా...?

Divya
తెలుగుదేశం పార్టీ తాజాగా వైసీపీ ట్రాప్ లో పడిందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం.. పదేళ్లు సీఎంగా చేశానంటూ చంద్రబాబు నాయుడు ఎప్పుడు గొప్పలు చెప్పుకునే వ్యక్తి ఇప్పుడు ఏకంగా సొంత స్ట్రాటజీ లేక కాపీని నమ్ముకున్నట్లు తెలుస్తోంది.. చంద్రబాబు చేస్తున్న పనులను చూస్తే ఇది నిజమే అనిపించేలా కనిపిస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయమే హాట్ టాపిక్ గా మారుతోంది. ఏపీలో ప్రజాదారణ పొందిన ఏపీ సీఎం జగన్ పథకాలను 2019లో సీఎం అయిన తర్వాత ప్రవేశపెట్టారు.


ఇప్పుడు జగన్ పథకాలను చంద్రబాబు నాయుడు పేరు మార్చి తన మేనిఫెస్టోలో చేర్చి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. ఈ పథకాలే కాకుండా నినాదాలు కూడా కాపీ కొడుతున్నట్టుగా కనిపిస్తోంది.. ఇటీవలే వైసిపి ప్రభుత్వం సిద్ధం ఆనే ఒక ప్రకటన అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా .. టిడిపి నాయకులు మాత్రం సంసిద్ధం మంటూ ఫ్లెక్సీలు కట్టారు .. గతంలో కూడా వైసిపి పార్టీ మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ గడపగడపకు స్టిక్కర్ల సైతం అంటించగా తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయాన్ని ఫాలో అయింది మీరే మా గౌరవం అంటూ మళ్ళీ కాపీ కొడుతూ పోలీస్ స్టిక్కర్లను విడుదల చేసింది.

మరొకసారి జగన్ మార్పుతో అమ్మ ఒడి పథకాన్ని చంద్రన్న తల్లికి వందనం పేరుతో తీసుకు వస్తున్నామని తెలిపారు. ఇక వైయస్సార్ చేయూత పథకాన్ని ఆడబిడ్డ నిధి పేరుతో తేబోతున్నట్లుగా తెలుస్తోంది. రైతు భరోసా పథకాన్ని అన్నదాత పేరుతో మళ్లీ అమలు చేస్తామని తెలిపారు. ఇలా తెలుగుదేశం పార్టీ పరోక్షంగా జగన్ పథకాలను తమ పథకాలను ప్రచారం చేస్తున్నామని ycp ట్రాప్లో పడిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా సొంతగా ఏది నిర్ణయించుకో లేకపోతే టిడిపి పార్టీకి జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందని చాలామంది రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: