జగన్ ఎన్నికల ప్రచారానికి పవన్ అడ్డుకట్ట?

Purushottham Vinay
2019 వ సంవత్సరంలో ‘యాత్ర’ సినిమా వచ్చింది.మహి.వి.రాఘవ్ దర్శకత్వంలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా ఈ సినిమా వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పెద్దగా అద్భుతాలు చేయకపోయినా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బరిలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి ఈ సినిమా మంచి మైలేజీ ఇచ్చినట్టు అయ్యింది. ప్రస్తుతం కూడా ఏపీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఎలక్షన్ కోడ్ అనేది ఇంకా అమల్లోకి రాకపోయినా ఆ హడావిడి అయితే మొదలైపోయింది. ఇదే మంచి టైం అని భావించి రాజకీయ నేపథ్యంలో రూపొందిన కొన్ని సినిమాలు  రిలీజ్ కాబోతున్నాయి.అందులో ‘యాత్ర 2’ సినిమా కూడా ఒకటి. మహి వి రాఘవ్ ఈ సినిమాకి  దర్శకుడు. వైసీపీ పార్టీ నేతలకి, అభిమానులకి బూస్టప్ ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం తెలుస్తుంది. ఫిబ్రవరి 8 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ హడావిడి  ఇంకా మొదలుకాలేదు. ఈ సినిమా కూడా వైసీపీకి మైలేజ్ అందిస్తుందని అంతా భావిస్తున్నారు.ఇది పూర్తిగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి పాజిటివ్ గా ఉండే సినిమా కావడమే దానికి కారణమని చెప్పాలి.



అయితే అదే డేట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా కూడా రీ రిలీజ్ కాబోతుంది అని సమాచారం తెలుస్తుంది. ఇది పూర్తిగా వైసీపీ అభిమానుల ఆనందానికి బ్రేకులు వేసే సినిమా అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో ‘పొలిటికల్ సెటైర్లు చాలా ఉంటాయి.ముఖ్యంగా అలాంటి వాడికి ఓటేస్తే నీ కరెంటు బిల్లు పెరిగిపోద్ది, నీకు దూల తీరిపోద్ది’ వంటి జనాలని ప్రభావితం చేసే డైలాగులు ఈ మూవీలో బలంగా ఉంటాయి. రీ రిలీజ్ సినిమాలకి సోషల్ మీడియాలో ఉండే హడావుడి అంతా ఇంత కాదు. ఈ విషయం అందరికీ తెలుసు కాబట్టి.. సోషల్ మీడియాలో ఈ సినిమా మార్మోగడం ఖాయం అనిపిస్తుంది.ఆ రకంగా ఈ సినిమాపై ‘యాత్ర 2 ‘ దెబ్బ పడే అవకాశాలు కూడా లేకపోలేదు. జగన్ ఎన్నికల్లో గెలవడానికి ఒక గట్టి ప్రచారంలాగా ఉపయోగపడే ఈ సినిమాకి అడ్డుకట్ట వేసేందుకు కౌంటర్ గా పవన్ కళ్యాణ్ తన కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు సినిమాతో రాబోతున్నాడు.మరి ఏమవుతుంది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: