వైసీపీలో గందరగోళం సృష్టిస్తున్న పవన్‌?

Chakravarthi Kalyan
తెలుగుదేశం, జనసేన పొత్తులు ప్రకటించడమే ఒక సంచలనం. ఈ పొత్తుపై అనేక సందేహాలు నెలకొన్నాయి. అధినేతలు పొత్తుకు సిద్ధం అయ్యారు కానీ స్థానిక నేతలు, కార్యకర్తలు కలుస్తారా అనే చర్చ సాగింది. అయితే ప్రస్తుతం సీట్ల విషయంలో ఇరు పార్టీల నడుమ కోల్డ్ వార్ నడుస్తోంది. పోటాపోటీగా ఇరు పార్టీల అధినేతలు సీట్లు ప్రకటించడంతో టీడీపీ, జనసేన పొత్తు గోవిందా అంటూ వైసీపీ సెటైర్లు వేస్తోంది.

అయితే ఇరు పార్టీల మధ్య పొత్తు కచ్చితంగా ఉంటుందని పవన్ ప్రకటించారు. ఈ విషయమై అంబటి రాంబాబు స్పందిస్తూ పొత్తు ధర్మమే కాదు.. ఏ ధర్మం పాటించని వాడే చంద్రబాబు తెలుసుకో తమ్ముడు పవన్ కల్యాణ్ అంటూ పోస్టు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అంబటి రాంబాబు పవన్ కల్యాణ్ ను తమ్ముడూ అంటూ సంబోధించడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో పేర్ని నాని పొత్తులో కొత్త డ్రామా.. ఓటు బదిలీ కాదు అనే ఉద్దేశంతోనే కొత్త డ్రామాకు చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ తెరతీశారు అని వ్యాఖ్యానించారు.

అయితే పేర్ని నాని.. అంబటి రాంబాబు ప్రకటనలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. అంబటి ఏమో చంద్రబాబు మోసం చేస్తారు తెలుసుకో అని పవన్ శ్రేయోభిలాషిగా మాట్లాడారు. పేర్ని నాని ఏమో ఇదంతా డ్రామా అంటున్నారు. మరొక వైసీపీ నేత ఎవరికి వారే యమునా తీరే అని టీడీపీ, జనసేన కూటమి ని ఉద్దేశించి అన్నారు.

అయితే పొత్తు ప్రకటనలపై వైసీపీ నుంచే మూడు అభిప్రాయాలు వ్యక్తం అయితే జనాలు దేనిని నమ్మాలో తెలియక అయోమయానికి గురవుతారు. కాబట్టి సీఎం జగన్ మోహన్ రెడ్డి ముగ్గురిని కూర్చోబెట్టి ఒక అభిప్రాయానికి తీసుకు రావాల్సి ఉంటుందని.. పవన్ వ్యాఖ్యల్లో టీడీపీ జనసేన కన్నా.. వైసీపీలోనే గందరగోళంగా ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జనసేన పోటీ చేసే స్థానాలే పవన్ ప్రకటించారని ఇందులో మాకేమీ అభ్యంతరం లేదని టీడీపీ నాయకులు తేల్చి చెప్పిన నేపథ్యంలో వైసీపీ గందరగోళానికి గురైందని విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: