అమరావతి : ఫిరాయింపు ఎంఎల్ఏలు కతలు చెబుతున్నారా ?

Vijaya


అనర్హత నోటీసులపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ముందు వైసీపీ ఫిరాయింపు ఎంఎల్ఏలు విచారణకు హాజరయ్యారు. వైసీపీలో గెలిచి ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి గెలుపుకు క్రాస్ ఓటింగ్ చేశారనే ఆరోపణలపై పార్టీ అనర్హత పిటీషన్ ఇచ్చింది. అంతకుముందే నలుగురు ఎంఎల్ఏలు ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్ చేసింది నాయకత్వం. దాని తర్వాత వాళ్ళు టీడీపీలో చేరిపోయారు. కరోనా సోకిందని ఒకళ్ళు, అనారోగ్యంగా ఉందని మరొకళ్ళు సమాధానాలిచ్చారట. 



ఈ నేపధ్యంలోనే ఇపుడు స్పీకర్ కార్యాలయం వీళ్ళ నలుగురికి నోటీసులు జారీచేసింది. వీళ్ళపై అనర్హత వేటు ఖాయమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. నిజానికి అసెంబ్లీ కాలపరిమితి అయిపోవచ్చింది. ఎన్నికలకు వచ్చేనెలలో షెడ్యూల్ వస్తుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ సమయంలో వీళ్ళపై అనర్హత వేటు వేయాల్సిన అవసరం కూడా లేదు. అయితే మరెందుకు అనర్హత వేటు వేయాలని అనుకుంటున్నట్లు ? ఎందుకంటే ఫిబ్రవరిలోనే  రాజ్యసభ ఎన్నికలు జరిగబోతున్నాయి. 



ఏప్రిల్లో రిటైర్ అవబోతున్న ముగ్గురు ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, సీఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్ స్ధానాలను కేంద్ర ఎన్నికల కమీషన్ భర్తీ చేయాల్సుంటుంది. ఆ భర్తీయే మార్చినెలలోనే జరిగే అవకాశముందని సమాచారం. అదే జరిగితే అసెంబ్లీలో బలం ప్రకారం వైసీపీకే మూడుసీట్లు దక్కుతాయి. ఒక ఎంపీని ఎన్నుకోవాలంటే 44 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాల్సుటుంది. వైసీపీకి ఉన్న బలం కారణంగా మూడుసీట్లను గెలుచుకోవటం ఖాయం.



అయితే ఏకగ్రీవంగా వైసీపీకి మూడుసీట్లను వదలేయటం ఇష్టంలేని చంద్రబాబునాయుడు టీడీపీ తరపున ఎవరినైనా పోటీకి దింపే అవకాశముంది. వైసీపీ ఎంఎల్ఏల నుండి క్రాస్ ఓటింగ్ ను ప్రోత్సహిస్తు చంద్రబాబు అభ్యర్ధిని దింపుతారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అందుకనే  అభ్యర్ధిని దింపే అవకాశం చంద్రబాబుకు ఇవ్వకూడదనే టీడీపీలో చేరిన  వైసీపీ ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదుచేశారు. మరి అనర్హత వేటు పడితే ఫిరాయింపు ఎంఎల్ఏలు ఏమిచేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: