వైసీపీలోకి ఎంట్రీ ఇస్తున్న హీరో సుమన్.. ఎక్కడి నుంచి పోటీ అంటే..?

frame వైసీపీలోకి ఎంట్రీ ఇస్తున్న హీరో సుమన్.. ఎక్కడి నుంచి పోటీ అంటే..?

Divya
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీల సైతం తమ అభ్యర్థులను ఎంపిక చేసే విధంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ వైసిపి ఎంపీ ఎమ్మెల్యేల జాబితాలను విడుదల చేస్తూ ఇప్పటికే ముందు వరుసలో ఉంది. ఇప్పటికీ 50 మందికి పైగా అసెంబ్లీ అరడజను మందికిపైగా ఎంపి స్థానాల అభ్యర్థులను కూడా ఖాయం చేశారు.ఇతరుణంలోని టాలీవుడ్ సీనియర్ హీరో అయినా సుమన్ కూడా రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.



గతంలో కూడా ఎన్నో సందర్భాలలో ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన తీరు పైన ప్రశంసలు కూడా కురిపించారు. జగనే మళ్లీ సీఎం కావాలని కూడా ప్రజలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారంటూ ఫలితాలు తెలియజేశారు.అంతేకాకుండా బీసీలకు ఎన్నో పదవులు ఇవ్వడమే కాకుండా వారికి ఎన్నో పథకాలు కూడా అందిస్తూ కులమత బేధాలను చూపించకుండా చేస్తున్నారంటూ సుమన్ తెలియజేశారు. వైసీపీ పట్ల సానుకూల వైఖరితో ఉన్నటువంటి హీరో సుమన్ త్వరలోనే ఈ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం ఎక్కువగా వినిపిస్తోంది. ప్రస్తుతం రాజమండ్రి లోక్సభ సభ్యుడుగా ఉన్న మార్గాన్ని భరత్ ఈసారి అసెంబ్లీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.


ఈ స్థానాన్ని బీసీలకే కేటాయించాలని పార్టీ డిసైడ్ చేసినట్లు సమాచారం.. గౌడ సామాజిక వర్గానికి చెందిన సుమ రాజమండ్రి తో రెండున్నర దశాబ్దాలుగా మంచి అనుబంధం ఉన్నది రాజమండ్రి కేంద్రంగా తన మిత్రుడు నడిపే స్వర్ణాంధ్ర స్వచంద్ర సేవ సంస్థలకు దాదాపు 25 ఏళ్లుగా సుమన్ సలహాదారుడుగా ఉన్నారు.. అన్ని భాషలలో కలుపుకొని దాదాపుగా 700 పైగా సినిమాలలో నటించిన సుమన్ రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా ఎమ్మెల్యే బరిలో రోజా కూడా నిలబడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి రేపు మాకు అధికారికంగా వైసిపి పార్టీ నుంచి ఒక న్యూస్ వెలబడబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: