బాబు, పవన్‌.. వైసీపీ నేతలు కోరుకునేది ఇదేనా?

Chakravarthi Kalyan
బాబు, పవన్‌ మధ్య ఎన్నికల పొత్తు ఖరారైపోయిందా.. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లనే పవన్ కళ్యాణ్ ప్రకటించారా.. పవన్ ప్రకటించిన సీట్లపై తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదా అంటే అవునంటున్నారు టీడీపీ నేతలు. పొత్తులో భాగంగా తెలుగుదేశం - జనసేన లు సీట్లపై దాదాపు ఓ అవగాహనకు వచ్చేశాయని.. మంచి రోజు చూసి ఉమ్మడిగా ప్రకటించటమే మిగిలి ఉందని.. టీడీపీ నేత బోండా ఉమా అంటున్నారు.

పొత్తులో భాగమైన అంశాలనే పవన్ మాట్లాడితే..., వైకాపాకేంటని ప్రశ్నిస్తున్న టీడీపీ నేత బోండా ఉమా.. వైసీపీలా చీకట్లో పొత్తు పెట్టుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీపడే పార్టీలు తెలుగుదేశం - జనసేన కాదన్నారు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడిలా జగన్ పెంపుడు కుక్కలు టీవీల ముందు మొరుగుతున్నాయని.. వెంట్రుక కూడా పీకలేరనే స్థాయి నుంచి ఇక దిగిపోతున్నా అని జగన్ ప్రకటించడంతో మంత్రులకు దిక్కు తోచట్లేదని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు.

తెలుగుదేశం - జనసేన పొత్తంటే ప్యాంట్లు తడిచిపోతున్న వైకాపా నేతలు డైపర్లు వేసుకుని తిరుగుతున్నారని టీడీపీ నేత బోండా ఉమా అంటున్నారు. తెలుగుదేశం - జనసేన కూటమితో వైకాపా కాస్తా ఇప్పుడు డైపర్ల పార్టీగా మారిందని.. తెలుగుదేశం - జనసేన కలవకూడదని గోతికాడ నక్కల్లా కాచుకు కూర్చోవటమే వైకాపా నేతల పనా అని టీడీపీ నేత బోండా ఉమా ప్రశ్నించారు.

ఇవాళ పవన్ వ్యాఖ్యలపై మాట్లాడిన కాపు నేతలు ఏనాడైనా కాపు రిజర్వేషన్లు, కాపు సంక్షేమం గురించి మాట్లాడారా అని టీడీపీ నేత బోండా ఉమా నిలదీశారు. వైసీపీలో ఏ నేతకు సీటు గ్యారెంటీ ఉందో మాపై విమర్శలు చేసేవారు చెప్పగలరా  అన్న టీడీపీ నేత బోండా ఉమా.. అంతర్గత కుమ్ములాటలతో ఏం చేయలేక జుట్టు పీక్కుంటున్న వైకాపా నేతలు తెలుగుదేశం - జనసేన పొత్తు విచ్ఛిన్నమైతే చాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్న సీట్ల కేటాయింపు ప్రకటనలు సజ్జల కొడుకు భార్గవ్ నేతృత్వంలో పని చేసే ఐప్యాక్ రూపొందించిందేనని టీడీపీ నేత బోండా ఉమా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: