అయోధ్యలో రామ మందిర్ ఎఫెక్ట్.. ఆకాశాన్నంటిన భూముల ధరలు.. గజం ఎంతంటే?

praveen
రామజన్మభూమి అయోధ్యలో ఇటీవల రామ మందిర ప్రారంభోత్సవం జరిగింది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవ్వగా బాలరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఇప్పుడు సామాన్య భక్తులకు కూడా రాముడి దర్శనానికి అనుమతి ఉండడంతో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా భారీగా అయోధ్యకు తరలి వెళ్తున్నారు.

 ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా కూడా అయోధ్య రామ మందిరం గురించి చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదాలు నిజం చేసే విధంగా ఎంతో మంది ముస్లిం సోదరులు కూడా అటు అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని స్వాగతిస్తూ.. శ్రీరాముడు దర్శనానికి తరలి వెళ్తున్నారు. అయితే అయోధ్యలో ఇటీవలే రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత అక్కడ భూముల రేట్లు ఒక్కసారిగా రెక్కలు వచ్చినట్లు పెరిగిపోయాయట. 2023లో చదరపు గజానికి 3174 ఉండగా ఈ 2024 జనవరిలో చదరపు గజానికి 8,877 పెరిగిందట.

 అంతేకాదు అయోధ్య లోనే నివాస ఆస్తుల కోసం శోధనలు 6.25 రేట్లు పెరిగినట్లు ఓ పోర్టల్ పేర్కొంది. ఇక అయోధ్య లోని స్థానిక రియల్ ఎస్టేట్ బ్రోకర్ అమిత్ సింగ్ చెప్పిన వివరాల ప్రకారం.. గత ఐదు ఆరు సంవత్సరాలుగా నగరంలో ధరలతో ఎటువంటి మార్పు లేదని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మార్కెట్ రేటు ఒక్కసారిగా పెరిగిపోయింది అంటూ తెలిపారు. అయితే ఒక్కసారిగా ధరలను పెరిగిపోవడంతో ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవడానికి దేశంలోని ఇతర ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి అధిక ధరలకు కూడా ఆస్తులను కొనుగోలు చేస్తున్నారట. అంతే కాదు ఇక ఆస్తి రిజిస్ట్రేషన్లు కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. 2017 నుంచి 2023 వరకు పోల్చి చూస్తే 2024 లో ఆస్తి రిజిస్ట్రేషన్లు ఏకంగా 120 శాతం పెరిగాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: