జనసేన: ఆ స్థానాలపై జాని కన్ను?

Purushottham Vinay
ఉమ్మడి నెల్లూరు జిల్లా అనేది వైసీపీకి మంచి పట్టున్న జిల్లా.. అలాంటి జిల్లాలో ప్రత్యర్థిని ఓడించాలంటే పొత్తు ఉంటే సరిపోదు. పోటీ చేసే అవకాశం కూడా కావాలని అంటున్నారు జనసేన లీడర్లు. గతంలో నెల్లూరు సిటి నుంచి ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించింది. అందుకే జనసేన పార్టీకి కూడా ఈ జిల్లాలో అవకాశం ఇవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తోంది. నెల్లూరు సిటి, నెల్లూరు రూరల్ స్థానాలు ఇవ్వాలని జనసేన పార్టీ బాగా పట్టుబడుతోందని సమాచారం వినిపిస్తోంది. అయితే అక్కడ ఇప్పటికే మాజీమంత్రి నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీకి రెడీగా ఉన్నారు. అందువల్ల ఆ రెండు స్థానాలు కాకుండా.. జిల్లాలో జనసేన పార్టీ కోసం నాలుగు నియోజకవర్గాలను ఆప్షన్ గా టిడిపి ఇచ్చినట్లు సమాచారం తెలుస్తోంది.సూళ్లూరుపేట, వెంకటగిరి, ఆత్మకూరు, కావలి నియోజకవర్గాల్లో ఏదొక జనసేన పార్టీకి అవకాశం ఉంటుందని తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మంచి సబంధాలు కలిగి ఉన్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేనలో చేరారు.



ఇప్పటికే ఇక్కడ జనసేన జిల్లా నేతలు పోటీకి ప్రయత్నాలు చేస్తుండగా జానీ మాస్టర్ చేరికతో ఆయన కూడా బరిలో ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. జిల్లాలో కలిసొచ్చే చోట నుంచి పోటీకి జానీ మాస్టర్ సిద్ధమయ్యారట. మరి ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది ఇటు టిడిపి, అటు జనసేన జిల్లా నేతలకు ఇంకా క్లారిటీ లేదు. తాము అడిగిన నియోజకవర్గం ఇవ్వలేదన్న అసంతృప్తిలో ఉన్న తమకు ఇప్పుడు మరో వ్యక్తి పోటీకి సిద్ధమవడంతో తమకు అవకాశాలు దక్కుతాయా లేదా అన్న సందేహం ఆ పార్టీ జిల్లా నాయకుల్లో స్టార్ట్ ఐయింది.జానీ మాస్టర్ నెల్లూరు జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జానీ పోటీ చేస్తే ఒక్కరికే అవకాశం ఉంటుందా లేదా మరో నియోజకవర్గం కూడా జనసేనకు టిడిపి అవకాశం ఇస్తుందా అన్నది చూడాలి.ఇంతకీ జానీ మాస్టర్ మనస్సు ఏ స్థానంపై ఉందంటే. ఇటీవల రెగ్యులర్‌గా నెల్లూరులో జానీ మాస్టర్ ఎక్కువగా పర్యటిస్తున్నారు.పైగా కష్టాల్లో ఉన్నవారికి ఆర్ధికంగా సాయపడుతూ.. ప్రజా సమస్యలపై పోరాటాలు కూడా చేస్తున్న జానీ మాస్టర్ ఈ సారి నెల్లూరు నుంచి పోటీ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: