తెలుగు రాష్ట్రాలను కలిపి ఉంచుతున్న టీవీ ఛానల్స్‌?

Chakravarthi Kalyan
రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్లు అవుతోంది. ఉమ్మడి ఏపీలో ఎన్నికల జరిగిన సమయంలో అధికార మార్పిడి జరిగింది తప్ప ఆంధ్రా తెలంగాణ ఓటర్లు వేర్వేరుగా తమ తీర్పును ఎప్పుడూ ఇవ్వలేదు. రాష్ట్రమంతా కలిసి ఒకే పార్టీని గెలిపించేవారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఇరు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు సంభవించాయి.

అయితే మనుషుల మధ్య తారతమ్యాలు లాంటివి ఏమీ లేవు. ఇరు రాష్ట్రాల ప్రజలు చక్కగా సమన్వయం చేసుకుంటూ హైదరాబాద్ లో కొంతమంది ఆంధ్రాలో జీవనం సాగిస్తున్నారు. కాకపోతే రాజకీయ పార్టీలను మాత్రం ప్రజలు అంగీకరించడం లేదు. వైసీపీ, టీడీపీలను తెలంగాణలో... కాంగ్రెస్, బీఆర్ఎస్ ను ఏపీలో ఓటర్లు స్వాగతించలేకపోతున్నారు. అయితే వార్తల పట్ల మాత్రం ఇరు రాష్ట్రాల్లో ఒకరిపై మరొకరికి ఆసక్తి ఉంది.

రాష్ట్ర విభజన అనంతరం ఆస్తుల పంపకాలు జరిగినట్లు వార్తా పత్రికలు కూడా విడిపోయాయి. హైదరాబాద్ లోని సీమాంధ్రులకు కావొచ్చు.. ఇతర పార్టీ నాయకులకు ఆంధ్రా వార్తలను ప్రచురించడం ఆపేశారు. మహా అయితే ఒక అరపేజీలో స్పాట్ వార్తలను కవర్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. అలాగే ఏపీలో కూడా తెలంగాణ వార్తలకు ప్రాధాన్యం ఇవ్వడం తగ్గించేశారు. సమగ్ర వార్తలను ఏపీ లోను, తెలంగాణలోను ఇవ్వడం మానేశారు.

పత్రికలు వేరు చేసినా.. టీవీలు మాత్రం రెండు రాష్ట్రాల వార్తలను కవర్ చేస్తున్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ఛానల్ ను ఏర్పాటు చేయలేవు. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. హైదరాబాద్ లో మార్కెట్ంగ్ పెద్దది.  కానీ ఆంధ్రాలో వ్యూయర్ షిప్ ఎక్కువ. కాబట్టి హైదరాబాద్ కి వచ్చిన ఆంధ్రులే ఆ ఛానళ్లను ఎక్కువగా చూస్తున్నారు. కారణం ఏదైనా ఒక్క టీవీ ఛానళ్లే ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వార్తలను సమపాళ్లలో కవర్ చేస్తున్నాయి. లేకపోతే కర్ణాటక లేదా ఇతర రాష్ట్రాల మాదిరిగా అక్కడేం జరగుతుందో తెలంగాణ, ఏపీలోని ప్రజలకు తెలిసేవి కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: