హైదరాబాద్ : బీజేపీ కీలక నిర్ణయం తీసుకుందా ?

Vijaya


పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణా బీజేపీ మళ్ళీ చేరికలపై దృష్టిపెట్టింది. చేరికలపై మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంఎల్ఏ ఈటల రాజేందర్ నేతృత్వంలో అగ్రనేతలు కమిటి నియమించారు. ఇదివరకే కమిటి ఉన్నా అప్పట్లో పెద్దగా యాక్టివ్ గా పనిచేయలేదు. తొందరలో జరగబోతున్న పార్లమెంటు ఎన్నికలు ఆ తర్వాత జరిగే లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ కమిటీని మళ్ళీ యాక్టివ్ చేయాలని జాతీయ నాయకత్వం డిసైడ్ అయ్యిందట.



ఇదే విషయాన్ని తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కూడా అగ్రనేతలు సమాచారం ఇచ్చారట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బండి-ఈటెలకు ఏమాత్రం పడదు. తనను అధ్యక్షపదవి నుండి జాతీయ నాయకత్వం తొలగించటంలో ఈటల చేసిన ఫిర్యాదులు కూడా కారణమని బండి బలంగా నమ్ముతున్నారు. అయితే జరిగిపోయిన విషయాలను తవ్వుకుని ఉపయోగంలేదని అనుకున్న జాతీయ నాయకత్వం వీళ్ళిద్దరినీ కలిపి పనిచేయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందుకనే కమిటిలో ఇద్దరిని నియమించబోతున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి.



నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా జాయినంగ్స్  కమిటి ఉన్న పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ప్రభావం చూపలేకపోవటం అటుంచితే పార్టీలో నుండి కొందరు నేతలు బయటకు వెళ్ళిపోయారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, విజయశాంతి లాంటి నేతలు బీజేపీని వదిలేసి కాంగ్రెస్ లో చేరారు. మరికొందరు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. ఎదుటి పార్టీల నుండి నేతలను ఆకర్షించాల్సిన జాయినింగ్స్ కమిటి పార్టీలో నుండి నేతలు బయటకు వెళ్ళకుండా నివారించలేకపోయింది.



అప్పట్లోనే ఇతర పార్టీల్లోని  నేతలు బీజేపీలో చేరటానికి  పెద్దగా ఆసక్తి చూపలేదు. అలాంటిది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకెవరు చేరుతారు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. కాకపోతే బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎంపీలు బీజేపీలో చేరే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. మల్కాజ్ గిరి, జహీరాబాద్, మెదక్, హైదరాబాద్ పార్లమెంటులో పోటీచేయటానికి బీజేపీలో పోటీ ఉంది.  సిట్టింగు కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్ నాలుగు స్ధానాలను వదిలేస్తే  మిగిలిన 9 నియోజకవర్గాల్లో ఎవరు పోటీచేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: