అమరావతి : షర్మిల తన అజెండాను స్పష్టం చేశారా ?

Vijaya


ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న వైఎస్ షర్మిల తన అజెండాను స్పష్టంచేసినట్లే అనిపిస్తోంది. బాధ్యతలు తీసుకున్న తర్వాత షర్మిల మాట్లాడుతు పదేళ్ళల్లో రాష్ట్రంలో రు. 10 లక్షల కోట్లు అప్పులు చేసినట్లు మండిపడ్డారు. పదిలక్షల కోట్ల రూపాయల అప్పులంటే మరి ఆమెదగ్గర ఉన్న వివరాలు ఏమిటో ఆమెకే తెలియాలి. ఎందుకంటే కేంద్రప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం ఏపీ అప్పులు రు. 4.57 లక్షల కోట్లు మాత్రమే.



రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్లరూపాయలు అన్నది ఎల్లోమీడియా, చంద్రబాబునాయుడు, బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి లెక్క. వీళ్ళు చెబుతున్న అప్పుల లెక్కకు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ చేసిన ప్రకటనకు మధ్య కొన్ని లక్షల కోట్ల రూపాయల తేడా ఉంది. చంద్రబాబు, ఎల్లోమీడియా, దగ్గుబాటి అంటే జాతివైరంతో జగన్ పైన 10 లక్షల కోట్ల రూపాయల అప్పంటు బురదచల్లేస్తున్నారు. మరి షర్మిలకు ఏమైంది ? కొంచెం కూడా విచక్షణ ఉపయోగించటంలేదని అర్ధమైపోతోంది.



గుడ్డెద్దు లాగ షర్మిల కూడా జగన్ వ్యతిరేకులు ఏమి మాట్లాడుతున్నారో అదే బాటలో వెళుతున్నారు. జగన్తో షర్మిలకు చాలాకాలంగా పడటంలేదన్నది తెలుస్తోంది. అయితే వాస్తవాలతో సంబంధంలేకుండా ఆరోపణలు చేయటంలో జగన్ బద్ధ వ్యతిరేకులతో షర్మిల కూడా చేరటమే విచిత్రంగా ఉంది. మూడు రాజధానుల కట్టారా అని జగన్ను నిలదీయటం విచిత్రంగా ఉంది. అసలు మూడు రాజధానులను కడతానని జగన్ ఎప్పుడు చెప్పారు ?



అవసరమైన మార్పులను వైజాగ్, కర్నూలులో చేసుకుని, అమరావతిని శాసనరాజధానిగా కంటిన్యు చేస్తానని మాత్రమే జగన్ చెప్పారు. జగన్ మూడు రాజధానులు అనగానే ఎల్లోమీడియా, చంద్రబాబు, పురందేశ్వరి వక్రీకరించినట్లుగా షర్మిల కూడా అదే బాటలో వెళుతున్నారు. జగన్ను మాత్రమే టార్గెట్ చేస్తే బాగోదన్న మొహమాటంతో చంద్రబాబు మీద కూడా కొన్ని విమర్శలు చేసినట్లున్నారు. ఏదేమైనా అన్న మీద ఆరోపణలు, విమర్శలతో షర్మిల కూడా విచక్షణ మరచిపోయారన్న విషయం అర్ధమైంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: