బాబు, జగన్.. ఇద్దరితో ప్రశాంత్‌ కిషోర్‌ మైండ్‌గేమ్‌?

Chakravarthi Kalyan
ఆంధ్రాలో పొత్తుల లెక్కలు తేలుతున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇప్పటికే చేతులు కలిపారు. ప్యాకేజీ కోసమే జనసేన టీడీపీకి మద్దతు ఇస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉండగా ఈ పొత్తులోకి బీజేపీని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జనసేన, టీడపీ, బీజేపీలు ఒకటే అన్నట్లుగా సాగుతున్న వేళ మధ్యలో ఓ కొత్త పరిణామం చోటు చేసుకుంది.


ప్రశాంత్ కిశోర్ ఇందులోకి రంగప్రవేశం చేయడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడేక్కింది. పొత్తుల ద్వారా టీడీపీని గెలిపించేందుకు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారు. టీడీపీకి రాబిన్ సింగ్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. ఇప్పుడు తాజాగా పీకే రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. రాబిన్ సింగ్ పై నమ్మకం లేకపోవడంతోనే పీకేనే తెరపైకి తీసుకువచ్చారు అనే ప్రచారం సాగుతోంది.


మరోవైపు పవన్ కల్యాణ్ పై నమ్మకం లేకనే మరో పీకేను తెచ్చుకున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో పాటు చంద్రబాబు కి తనపై నమ్మకం లేకనే వ్యూహకర్తలపై ఆధారపడుతున్నారని వైసీపీ మంత్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ల నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని విమర్శించుకుంటున్నారనే విషయం వాళ్లు మరిచిపోతున్నారు. వాస్తవానికి పీకేను పరిచయం చేసిందే వైసీపీ అధినేత జగన్.


అంటే తనపై తనకు నమ్మకం లేక జగన్ పీకేను తెచ్చుకున్నారా.. ప్రస్తుతం కూడా  ఐ ప్యాక్ టీం సర్వే ల ఆధారంగా ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చుతున్నారు. అంటే జగన్ కూడా సొంతంగా ఎన్నికలకు వెళ్లలేరనే అర్థం వస్తోంది. మరోవైపు పవన్ కల్యాణ్ రాకతో కొంత బలోపేతం అయిన టీడీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రావడంతో మరింత బలం చేకూరినట్లవవుతుంది. ఎన్నికల్లో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకునేందుకు టీడీపీ సిద్ధంగా లేదని అర్థం అవుతుంది. కాకపోతే ఎవరికి వారు ప్రశాంత్ కిశోర్ పేరు వాడుకోని మైండ్ గేమ్ ఆడాలని చూస్తున్నారు. ఇదంతా ఎన్నికల వ్యూహంలో భాగమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

pk

సంబంధిత వార్తలు: