గోదావరి : పవన్ను జోగయ్య వాయించేస్తున్నారా ?
మాజీ ఎంపీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ సపోర్టర్ చేగొండి హరిరామజోగయ్య గురించి పరిచయం అవసరంలేదు. అలాంటి జోగయ్య ఇపుడు పవన్ను వాయించేస్తున్నారు. తాజాగా పవన్ను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు. రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో పవన్ తన వైఖరిని స్పష్టంచేయాలని జోగయ్య డిమాండ్ చేశారు. జోగయ్యేమో పవన్ను ముఖ్యమంత్రిగా చూడాలని కలలు కంటుంటే పవనేమో చంద్రబాబునాయుడును సీఎంగా చూడాలని తపిస్తున్నారు.
ఈ విషయంలోనే జోగయ్యకు పవన్ అంటే బాగా మండుతున్నట్లుంది. కాపులందరు మద్దతుగా నిలిచి జనసేన గెలిపించి పవన్ను ముఖ్యమంత్రిని చేద్దామని, చేయాలని జోగయ్య చాలాకాలంగా అడుగుతున్నారు. కాపులకు పదేపదే విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే ఒకసారి తాను సీఎం అవుతానని మరోసారి ముఖ్యమంత్రి పదవిచేపట్టేంత అనుభవం తనకు లేదని ఇలా పవన్ మాటలు మారుస్తున్నారు. పవన్ గోల ఇలాగుంటే జగన్మోహన్ రెడ్డి, మంత్రులేమో చంద్రబాబు ప్రయోజనాలను కాపాడేందుకే పవన్ పార్టీ పెట్టినట్లు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని పవన్ డ్రామాలాడుతున్నాడని, కాపులను మోసం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు.
అయితే ఈమధ్య పవన్ చెబుతున్నది ఏమిటంటే చంద్రబాబే ముఖ్యమంత్రి పదవికి అర్హుడని. ఎప్పుడైతే పవన్ సీఎంగా చంద్రబాబు ప్రస్తావన తెచ్చారో అప్పటినుండే జనసేన నేతలు, క్యాడర్ వైఖరిలో తేడాలు మొదలయ్యాయి. పార్టీకి ఒక్కోనేత రాజీనామాలు చేస్తున్నారు. అందుకనే జోగయ్య పవన్ కు బహిరంగ లేఖ రాసింది. ముఖ్యమంత్రి పదవిపై వైఖరి చెప్పాలని నిలదీశారు.
ఇక్కడ జోగయ్యకు అర్ధంకాని విషయం ఏమిటంటే చంద్రబాబును సీఎంగా చేయటంకోసమే పవన్ పనిచేస్తున్నారని. ఈ విషయాన్ని మంత్రులు చెబితే మొదట్లో జోగయ్య అంగీకరించలేదు. అయితే తర్వాత్తర్వాత పవన్ ఆలోచనలు ఏమిటో జోగయ్యకు కూడా అర్ధమైనట్లుంది. అందుకనే పవన్ ముఖతానే ఆ విషయాన్ని నేరుగా విందామని జోగయ్యకు తాజాగా లేఖ రాసింది. చంద్రబాబు నాయకత్వాన్ని సమర్ధిస్తున్నది లేనిది పవన్ స్పష్టంచేయాలని లేఖలో డిమాండ్ చేయటం గమనార్హం. మరి జోగయ్య లేఖకు పవన్ ఎలాంటి సమాధానమిస్తారో చూడాలి.