మెడికల్‌ కాలేజీల్లో అర్జున్‌రెడ్డిలు పెరుగుతున్నారా?

Chakravarthi Kalyan
ఒంగోలు మెడికల్ కాలేజీలో ఇటీవల ఎంబీబీఎస్ చదువుకునే విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్లాటకు దిగారు. ఎంబీబీఎస్ చదువుతున్న కొంతమంది విద్యార్థులు గంజాయి తాగడం, వ్యసనాలకు లోను కావడంతో పాటు ఇతర స్టూడెంట్లను ఇబ్బంది పెడుతుండటంతో వారు పై అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఎవరైతే గంజాయి తాగి అల్లర్లకు పాల్పడుతున్నారో ఆ విద్యార్థులను కళాశాల యాజమాన్యం సస్పెండ్ చేసింది.


దీంతో తమపై ఎవరూ కంప్లైంట్ చేశారో వారిపై సస్పెండ్ అయిన విద్యార్థులు దాడికి దిగారు. తోటి విద్యార్థుల తలలు పగలగొట్టారు. దాడులు చేశారు. దీంతో ఈ ఘటన వివాదాస్పదంగా మారింది. వైద్య విద్య లో చేరిన చాలా మంది విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో తీవ్ర జూనియర్లకు తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తుంటారు. సమాజంలో ఉన్నత విద్యను అభ్యసించి నలుగురి ప్రాణాలను కాపాాడాల్సిన వారు తోటి స్టూడెంట్లను మాత్రం ర్యాగింగ్ పేరుతో నానా చిత్రహింసలు పెడుతుంటారు.


ఇలా ర్యాగింగ్ చేసే వారిని చాలా కాలేజీల్లో సస్పెండ్ చేస్తున్నారు. ఒక్కసారి సస్పెండ్ అయితే వారి జీవితాల్లో అది మాయని మచ్చగా మిగిలిపోతుంది. అయినా భవిష్యత్తు గురించి పట్టించుకోకుండా వచ్చిన సువర్ణవకాశాన్ని వదిలిపెట్టి ర్యాగింగ్, గంజాయి, వ్యసనాలకు అలవాటు పడి కెరీర్ ను నాశనం చేసుకుంటున్నారు. వైద్య వృత్తిలో రాణించాలంటే ఓపిక, సహనం ఎంతో ఉండాలి. కానీ అలాంటి వృత్తి చేపట్టాలనుకుంటున్న చాలా మంది స్టూడెంట్లు తాత్కాలిక ఆనందాల కోసం వ్యసనాలకు బానిసై నానా ఇబ్బందులు పడుతున్నారు.


ఎంబీబీఎస్, బీడీఎస్ చదివే విద్యార్థుల్లోనే ఎక్కువగా ర్యాగింగ్ అనేది జరుగుతుంది. గతంలో వరంగల్ లో ప్రీతి ఘటన కూడా అలాంటిదే. సీనియర్ స్టూడెంట్లు జూనియర్లను వేధించడం వల్ల అనేక దుష్పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఈ విధంగా జరగకుండా ఆ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు కఠిన చర్యలు తీసుకోవాలి.  ర్యాగింగ్ భూతాన్ని, గంజాయి, వ్యసానాలు స్టూడెంట్ల దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: