తగ్గేదేలే.. చైనాకి షాక్‌ ఇచ్చిన అమెరికా?

Chakravarthi Kalyan
ఎటు చూసినా ఘర్షణలు బెదిరింపులే రివాజుగా మారిన ప్రపంచంలో ఏడాదిగా మాటమంతీ లేనీ రెండు అగ్ర రాజ్యాలు ఒకచోట కూర్చొని చర్చించుకున్నాయంటే కాస్త వింతగానే అనిపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ల మధ్య బుధవారం కాలిఫోర్నియాలో ద్వైపాక్షిక చర్చలు జరపడం అందులో పురోగతి సాధించామని చెప్పడం ఉపశమనం కలిగించే పరిణామమే. ఇద్దరూ కలవడమే పెద్ద వార్త. ఇంతకు మించి వీరి దగ్గర నుంచి ఎవరూ ఏమీ ఆశించడం లేదు.


ఈ సమావేశం అనంతరం బయటకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ని ఓ నియంతగానే విశ్వసిస్తున్నానని చెప్పారు. చైనా ప్రభుత్వం తన ప్రభుత్వానికి చాలా తేడా ఉందని అన్నారు. జిన్ పింగ్ ని నియంత లాగే చూస్తున్నారా అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు.


ఇరు దేశాల మధ్య వాణిజ్య పోరు నడుస్తున్న నేపథ్యంలో బైడెన్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ ఏడాది జూన్ లోను అదే మాట మాట్లాడారు. అప్పట్లోనే బైడెన్ తీరును చైనా ఖండించింది. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసేలా కనిపిస్తుంది. కాగా కాలిఫోర్నియాలోని ఓ విశాల భవనంలో ఈ సమ్మిట్ ముగిసింది. రెండు దేశాల మధ్య విభేదాలు సమసి పోయాలు దౌత్య సంబంధాలు తప్పు దోవ పట్టకుండా కృషి చేయడానికి అధ్యక్షులు అంగీకరించారు.


ఈ సమావేశంలోఇరువురు నేతలు ఇరాన్, పశ్చిమాసియా, ఉక్రెయిన్, తైవాన్, ఇండో ఫసిపిక్ ఆర్థిక సమస్యలు కృత్రిమ మేధస్సు, మాదక ద్రవ్యాల సరఫరా, వాతావరణం వంటి ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించారు. అమెరికాలో అక్రమ మాదక ద్రవ్యాలు వాణిజ్యం చేపడుతున్న చైనా సంస్థలపై చర్యలు తీసుకుంటామని జిన్‌పింగ్‌ హామీ ఇచ్చారు. తైవాన్ అంశం ఇరు దేశాల మధ్య సంబంధాలకు చాలా సున్నితమైన అంశంగా మారిందని జిన్ పింగ్ అన్నారు. తైవాన్ స్వాతంత్ర్యానికి అమెరికా మద్దతు ఇవ్వకూడదని కోరుతూ ఆయుధ సరఫరాను నిలిపివేయాలని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: