హైదరాబాద్ : ఆపరేషన్ సక్సెస్..అందరూ వెయిట్ చేస్తున్నారా ?
యావత్ తెలుగుదేశంపార్టీ శ్రేణులంతా ఈ సందర్భం కోసమే ఎదురుచూస్తున్నారు. విషయం ఏమిటంటే చంద్రబాబునాయుడు కుడికంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ పూర్తయ్యింది. ఎల్వీ ప్రసాద్ ఆపరేషన్ విజయవంతంగా ముగించేందుకు ఆసుపత్రి వైద్యులకు సుమారు గంటసేపు పట్టింది. ఆపరేషన్ తర్వాత రెండుగంటల పాటు చంద్రబాబును ఆసుపత్రిలోనే వైద్యులుంచారు. ఏమన్నా రియాక్షన్స్ వస్తాయేమో అబ్జర్వ్ చేయటానికే ఉంచారు. ఎలాంటి రియాక్షన్ రాలేదని నిర్ధారించుకున్నాక డిస్చార్జి చేసేశారు. ఆసుపత్రి నుండి వెళ్ళేముందు ఆపరేషన్ చేసిన డాక్టర్ల బృందంతో చంద్రబాబు గ్రూప్ ఫొటో దిగారు.
డాక్టర్ల సలహా ప్రకారం ఒక వారంరోజులు ఇంట్లోనే చంద్రబాబు విశ్రాంతి తీసుకోక తప్పదు. తర్వాతే బంధువులు, పార్టీ నేతలను కలిసే అవకాశముంది. నిజానికి చంద్రబాబు మెడికల్ బెయిల్ మీద రాజమండ్రి జైలునుండి బయటకు వచ్చినా సరిగ్గా తెలంగాణా ఎన్నికల సమయంలో బయటకు రావటం యాధృచ్చికం. చంద్రబాబు జైలులో నుండి బయటకు రావాలని తెలంగాణా ఎన్నికల్లో సీమాంధ్ర జనాలు ముఖ్యంగా కమ్మ జనాలకు మార్గనిర్దేశం చేయాలని సామాజికవర్గంలోని చాలామంది ఎదురుచూస్తున్నారు.
సరిగ్గా అలాంటి సమయంలోనే మద్దతుదారులంతా కోరుకుంటున్నట్లు పోయిన నెలాఖరులో చంద్రబాబు జైలునుండి రిలీజయ్యారు. అప్పటినుండి ఇంట్లోనే ఉన్నప్పటికీ చంద్రబాబు తనను కలిసిన నేతలతో ఫుల్లు బిజీగా ఉన్నారు. వచ్చే పోయే నేతలతో చంద్రబాబు బిజీ అయిపోయారు. నిజానికి మెడికల్ బెయిల్ ఇచ్చేటప్పుడే కోర్టు చాలా స్పష్టంగా షరతులను విధించింది. అయితే జైలు నుండి విడుదలై బయటకు రాగానే షరతులను ఉల్లంఘించటం మొదలుపెట్టారు.
అప్పుడు మొదలైన ఉల్లంఘనలు ఇప్పటికీ కంటిన్యు అవుతునే ఉంది. కోర్టు ఏదైతే చేయకూడదని చెప్పిందో అదంతా చంద్రబాబు చేస్తునే ఉన్నారు. కోర్టు ఏమి షరతులను విధించినా, మంత్రులు, వైసీపీ ఎంఎల్ఏలు ఎంత గోలచేసినా చంద్రబాబు మాత్రం తాను చేయదలచుకున్నది చేస్తునే ఉన్నారు. నిజానికి ఈ షరతులన్నింటినీ చంద్రబాబు పాటిస్తారా ? లేకపోతే ఉల్లంఘిస్తారా అన్నది మెడికల్ బెయిల్ ఇచ్చే ముందు సీఐడీ, హైకోర్టు ఆలోచించుకునుండాలి. ఏదేమైనా చంద్రబాబు కంటి ఆపరేషన్ సక్సెస్ అయినందుకు సంతోషించాల్సిందే.