ఢిల్లీ : లోకేష్ చిక్కాడు
మొత్తానికి సీఐడీ అధికారులకు లోకేష్ చిక్కాడు. గడచిన 15 రోజులుగా అరెస్టు భయంతో రాష్ట్రాన్ని వదిలేసి ఢిల్లీలోనే మకాంవేసిన లోకేష్ ను శనివారం సాయంత్రం సీఐడీ అధికారుల బృందం కలిసింది. గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఇంట్లో పార్టీ నేతలతో సమావేశంలో ఉన్న లోకేష్ ను సీఐడీ అధికారులు కలిశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ లో సీఐడీ అధికారులు లోకేష్ ను ఏ 14వ నిందితుడిగా కేసు నమోదుచేశారు. లోకేష్ ను కలిసి సీఐడీ నోటీసులు ఇచ్చినపుడు అక్కడే మరో ఎంపీ కనకమేడ రవీంద్రకుమార్ కూడా ఉన్నారు.
ఎప్పుడైతే కేసు నమోదైందో అరెస్టు కాకుండా వెంటనే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే హైకోర్టు లోకేష్ పిటీషన్ను డిస్మిస్ చేసేసింది. ఇదే సమయంలో అక్టోబర్ 3వ తేదీవరకు అరెస్టు చేయద్దని సీఐడీని ఆదేశించింది. అలాగే సీఐడీ విచారణకు సహకరించాలని లోకేష్ ను ఆదేశించింది. దాంతో సీఐడీ అధికారులు లోకేష్ కు నోటీసులు ఇవ్వటానికి ఢిల్లీకి చేరుకున్నారు. ఉదయం నుండి లోకేష్ కోసం కొన్ని ప్రాంతాల్లో తిరిగి మొత్తానికి జయదేవ్ ఇంట్లో కలిశారు.
తనకు ఏ కేసులో నోటీసులు ఇస్తున్నారో చెప్పాలని లోకేష్ అడిగారు. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఫైబర్ గ్రిడ్ స్కామ్ లో కూడా లోకేష్ పై కేసులున్నాయి. అయితే రింగు రోడ్డు స్కామ్ లో విచారణకు నోటీసులు ఇస్తున్నట్లు చెప్పారు.
అక్టోబర్ 4వ తేదీన విజయవాడలోని సీఐడీ ఆఫీసులో విచారణకు రావాలని నోటీసులో స్పష్టంగా ఉంది. వాట్సప్ లో పంపిన నోటీసులు తనకు అందాయని, నోటీసులు తాను అందుకున్నట్లు కన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్లు లోకేష్ చెప్పారు. అయితే పర్సనల్ గా కలిసి నోటీసులు ఇవ్వాల్సుంది కాబట్టి ఢిల్లీకి వచ్చినట్లు అధికారులు చెప్పారు. లోకేష్ ను అక్టోబర్ 4వ తేదీన విచారణకు రావాలని చెప్పారు కాబట్టి వచ్చిన తర్వాత అధికారులు ఏమిచేస్తారనేది ఆసక్తిగా మారింది.