రాయలసీమ : నలుగురిని ఒకేసారి జగన్ ఉతికి ఆరేశారా ?

frame రాయలసీమ : నలుగురిని ఒకేసారి జగన్ ఉతికి ఆరేశారా ?

Vijaya



తిరుపతిలో జరిగిన బహిరంగసభలో చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ, లోకేష్ ను జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా ఉతికి ఆరేశారు.  ప్రారంభంలో వీళ్ళ పేర్లు ప్రస్తావించకుండానే గతంలో వీళ్ళు చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు, చేష్టల ద్వారా చాకిరేవు పెట్టారు. ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రంలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని దానికి వాలంటీర్లే కారణమని పవన్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను జగన్ ప్రస్తావిస్తు కోట్లాదిమందికి సేవలు అందిస్తున్న వాలంటీర్లపై దత్తపుత్రుడు ఆరోపణలు చేయటం బాధాకరమే అన్నారు.



గడచిన పదేళ్ళుగా చంద్రబాబుకు రాజకీయ వాలంటీరుగా పనిచేస్తున్నది ఎవరో అందరికీ తెలుసన్నారు. వాలంటీర్లపై తప్పుడు ఆరోపణల స్క్రిప్ట్ రామోజీరావుది అయితే నిర్మాత చంద్రబాబు, నటన, మాటలన్నీ దత్తపుత్రుడిదే అని సెటైర్లు వేశారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బావమరిది క్యారెక్టర్లు ఎలాంటివో జనాలందరికీ తెలిసిందే అన్నారు. ఒకడేమో స్విమ్మింగ్ పూల్లో అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తు కనిపిస్తాడొకడు, అమ్మాయి కనిపిస్తే ముద్దయినా పెట్టాలి లేదా కడుపైనా చేయాలని అంటాడు ఇంకోడు అని జగన్ రెచ్చిపోయారు.



ఒక టీవీషోకి వెళ్ళి బావా మీరు సినిమాల్లో చేసినవి నేను నిజజీవితంలో చేశాను అని అంటాడు ఇంకోడు అని మండిపోయారు. చివరగా బాబుతో పొత్తు బీజేపీతో కాపురం అని పవన్ను పట్టుకుని ఉతికేశారు.



ఒక్క వాలంటీర్ అయినా అమ్మాయిల్ని లోబరుచుకున్నారా ? అని జనాలను జగన్ అడిగారు. అమ్మాయిల్ని లోబరుచుకోవటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, కాపురాలు చేయటం తర్వాత వదలేయటమే పవన్ కల్యాణ్ క్యారెక్టర్ అంటు మండిపోయారు. ఇలాంటి వాళ్ళా వాలంటీర్ల సేవలను తప్పుపట్టేది అని రెచ్చిపోయారు. పదేళ్ళుగా చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని వాలంటీరుగా పనిచేస్తున్న పవన్ కల్యాణ్ గురించి అందరికీ తెలిసిందే అని పదేపదే ప్రస్తావించారు. వాలంటీర్ల గురించి, తన పరిపాలన గురించి చెడ్డగా చెబుతున్న, రాస్తున్న వాళ్ళని నమ్మద్దని జనాలకు జగన్ విజ్ఞప్తి చేశారు. ఇక జగన్ పై వీళ్ళ రియాక్షన్ ఎలాంగుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: