మోడీకు టఫ్‌ ఫైట్‌.. కాంగ్రెస్‌ బలం పుంజుకుంటోందా?

Chakravarthi Kalyan
ఇప్పటికే రెండు సార్లు ప్రధాని పీఠం అలంకరించిన మోదీ.. మరోసారి కూడా తనదే పీఎం కుర్చీ అన్న ధీమాలో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్‌ పరిస్థితి దయనీయంగా ఉంది. అందుకే ఇప్పుడు ఆ పార్టీ.. అందరినీ కలుపుకుని పోతోంది. తానొక్కటే మోడీని ఢీకొట్టలేనని తెలుసు కాబట్టే భాగస్వామ్య పార్టీలను కలుపుకుపోతోంది. ఇందుకు బెంగళూరు వేదిక ఓ ఉదాహరణగా నిలిచింది.


గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ కి సంబంధించిన ఆర్డినెన్స్ ఉండదని, ఆ ఆర్డినెన్స్ ను ఎత్తేస్తాము అని చెప్పాలని కాంగ్రెస్ పార్టీని గట్టిగానే డిమాండ్ చేసింది. అయితే అప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడంపై కాంగ్రెస్ పార్టీ తట పటాయించిందని సమాచారం. అయితే మమతా బెనర్జీ, అలాగే నితీష్ కుమార్ లాంటి నేతల ప్రమేయంతో కాంగ్రెస్ పార్టీ తన మనసు మార్చుకుందట. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ పెట్టి మరి తాము అధికారంలోకి వస్తే ఢిల్లీ ఆర్డినెన్స్ ను రద్దు చేస్తామని ప్రకటించింది.


దాంతో  ఇప్పుడు యూపీఏ భాగస్వామ్య పక్షాల మీటింగ్ కు ఆమ్ ఆద్మీ పార్టీ అటెండ్ అయ్యింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాది పార్టీ, అలాగే తృణమూల్ కాంగ్రెస్ ఈ మూడు కూడా బయట నుండి యూపీఏకు మద్దతును ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. ఈ మూడు పార్టీలు యూపీఏలో చేరిపోయాయి. ఇప్పుడు ఈ కూటమికి ఇండియా అని పేరు పెట్టారు.


ఇక్కడ ఇండియా అంటే ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇంక్లుజివ్‌ అలయెన్స్‌.. దీంతో యూపీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు కమ్యూనిస్టులు, తృణమూల్, ఆమ్ ఆద్మీ పార్టీ అలాగే సమాజ్ వాది పార్టీ వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. మరోవైపు ఎన్డీఏ సమావేశం కూడా జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ ని కూడా పిలిచారు. ఉత్తర ప్రదేశ్ నుండి సొహైల్ పార్టీ ని కూడా పిలిచారు. దీంతో ఇప్పుడు దేశంలో ఏ పార్టీ ఏ వైపు అన్న విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: