పవన్‌కు అనారోగ్యం.. అయినా ఆగని సభలు?
ఆయనకు ఒళ్ల నొప్పులతో పాటు జ్వరం కూడా వచ్చింది. దీంతో పవన్ మిగతా సభల్లో స్పీచ్ ఇవ్వకుండానే చేతులు ఊపుకుంటూ జనాలకు కనిపిస్తూ వెళ్లిపోయారు. ఉదయం సమావేశం తర్వాత మిగతా సభల్లో ఆయన మాట్లాడలేదు. హలో ఆంధ్రప్రదేశ్, బైబై జగన్ అంటూ వెళ్లిపోయారు. అమలాపురం సభలో దాదాపు 3 గంటల పాటు పాల్గొన్నారు. సభ అనంతరం తాను బస చేసిన సత్యనారాయణ గార్డెన్ కు వెళ్లిన పవన్ కు ఒళ్లు నొప్పులు, జ్వరం వచ్చినట్లు జనసేన నాయకులు తెలిపారు.
దీంతో పవన్ కేవలం అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారు. చివరకు రాజోలు చేరుకుని డిండి రిసార్టులో బస చేశారు. అనారోగ్యంతో ఆయన మాట్లాడలేకపోయినా అభిమానులు మాత్రం నిరాశ చెందకుండా పవన్ కల్యాణ్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అయితే పవన్ తన స్పీచ్ ఆవేశంగా, గట్టిగా మాట్లాడటం వల్ల గొంతు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది.
చాలా అగ్రెసివ్ గా పవన మాట్లాడతారు. దీనికి తోడు వారాహి యాత్రలో ఆ వాహనంపై గంటల తరబడి నిలబడి ఉండటం కూడా ఆయనకు ఒళ్లు నొప్పులు రావడానికి కారణం. పవన్ మాట్లాడకపోయిన ఆయన అభిమానులు మాత్రం సభలకు రావడం సానుకూల అంశం. పవన్ సభలకు ప్రజలు కానీ, జన సేన నాయకులు కానీ స్వచ్ఛందంగా వస్తారని మరో సారి రుజువైంది. మరి తొందరగా కోలుకుని ప్రజల వద్దను వారాహి యాత్ర కొనసాగించాలని జనసేన అధినేత కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.