చంద్రబాబు వరి రాజకీయం..?

Chakravarthi Kalyan
మొన్నా మధ్యన చంద్రబాబు నాయుడు ఇంకా పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో  హడావుడి జరగడం మనకు తెలుసు. ఎందుకు హడావుడి అంటే తడిసిన ధాన్యాన్ని వీళ్ళు వస్తున్నారనే కారణంతో అక్కడ నుండి తరలించే ఏర్పాట్లు అవి అని తెలుస్తుంది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి తడిసిన ధాన్యాన్ని తీసుకొచ్చి చూపిస్తున్నారట. అలా తడిసిన ధాన్యాన్ని చూపించడానికి వస్తున్న వాళ్లని పోలీసులు అడ్డుకున్నారని ఇప్పుడు చర్చ నడుస్తుంది.


దీనిపై కొంతమంది ఏమని అడుగుతున్నారు అంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తడిసిన ధాన్యాన్ని చూడ్డానికి వస్తున్నారు. అలాంటప్పుడు మీరు వెళ్లి తడిసిన ధాన్యాన్ని చూపించడం ఏంటి అసలు అని అడుగుతున్నారు. దీని వెనక ఇలా తడిసిన ధాన్యాన్ని ప్రత్యేకంగా చూపించడం గనక ఏదో లెక్క ఉందని వాళ్ళు అంటున్నారు. అసలు లెక్క ప్రకారం తడిసిన ధాన్యాన్ని తీసుకుపోయి వాటిని ఎక్కడ పెట్టినా మొలకలు వచ్చేస్తాయి లేదా పురుగులు వచ్చేస్తాయి. చివరికి పాడైపోతాయి.


అలాంటప్పుడు ఎందుకు అలా చేస్తారు అని అడుగుతున్నారు. కానీ ఎప్పుడూ ఏదో రకంగా ప్రతిపక్ష పార్టీ అనేది హడావిడి చేయకపోతే అది కనుమరుగైపోయే సమస్య ఉందని అంటున్నారు కొంతమంది. అందుకోసమే ఇలా చేస్తున్నారని అంటున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకా పవన్ కళ్యాణ్ ఈ పర్యటనకు వచ్చినప్పుడు ఆల్రెడీ తడిసిన ధాన్యాన్ని తీసుకెళ్లిపోయారని అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు మళ్ళీ తడిసిన ధాన్యాన్ని వీళ్ళు ఎక్కడినుండి పట్టుకొచ్చారు అని ప్రశ్న వేస్తున్నారు కొంతమంది.


అసలు దాంట్లో లాజిక్ కనపడడం లేదని అంటున్నారు. వాళ్ల లెక్క ప్రకారం తడిసిన ధాన్యాన్ని ఆల్రెడీ అంతకుముందే తీసుకెళ్లిపోయారు కాబట్టి, పక్క ఊరు నుండి పొడిగా ఉన్న ధాన్యాన్ని తడిపి మరి తీసుకొస్తున్నారని అంటున్నారు. ఆ రకంగా తడిపి తీసుకొచ్చి చూపిస్తున్న ధాన్యాన్ని పోలీసులు అడ్డుకుంటే దానిని మళ్లీ ఇష్యూ చేస్తున్నారని అంటున్నారు. రాజకీయాల్లో చాలా రకాలు ఉంటే అందులో ఇదొక రకం  అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: