ఢిల్లీ : సుప్రింకోర్టు ఎందుకు పట్టించుకోలేదు ?

Vijaya



రాజధాని అమరావతి విచారణ విషయంలో ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా సుప్రింకోర్టు పట్టించుకోలేదు. ఇక్కడ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి వేర్వేరు కాదన్న విషయం తెలిసిందే. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అమరావతి నుండి జగన్ విశాఖపట్నంకు అధికారికంగా షిఫ్టయిపోవాలని ఆతృతపడుతున్నారు. అయితే జగన్ ఎంత ఆతృతపడుతుంటే సుప్రింకోర్టులో విచారణ  అంత  వెనక్కు వెళుతోంది. మంగళవారం జరిగిన విచారణలో రెండువైపుల వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం కేసును జూలై 11వ తేదీకి వాయిదా వేసింది.



కేసు వాయిదా వేయటం అంటే ప్రభుత్వానికి తీవ్ర నిరాసనే చెప్పాలి. అందుకనే ఎలాగైనా విచారణ తొందరగా జరిగేట్లు ప్రభుత్వ న్యాయవాదులు ఎంత ప్రయత్నించినా కుదరదు పొమ్మన్నది. కనీసం హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వమని విజ్ఞప్తిచేసినా సుప్రింకోర్టు పట్టించుకోలేదు. ఇక్కడే చాలామందికి సుప్రింకోర్టు వైఖరి అంతుచిక్కటంలేదు. అధికారపార్టీ నేతలకైతే మింగుడే పడటంలేదు. కేసు సుప్రింకోర్టు మెట్లెక్కిన దగ్గర నుండి ప్రభుత్వ వాదన ఎందుకనో పెద్దగా చెల్లుబాటు కావటంలేదు.



కేసు విచారణలో స్పీడు పెంచాలని జగన్ ఇప్పటికే రెండుసార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదు. పైగా అర్జంటుగా కేసు విచారణ జరిపి తీర్పివ్వటం కుదరనిపనిగా ధర్మాసనం చెప్పేసింది. కేసులో రాజ్యాంగ సమస్యలు చాలా ముడిపడున్న కారణంగా అర్జంటుపేరుతో తాము కేసును విచారణకు టేకప్ చేయటం సాధ్యంకాదని తేల్చేసింది. ఇదే ధర్మాసనం ఓకపుడు కేసు విచారణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చింది. అలాంటి ధర్మాసనం ఇపుడు మరోలా వ్యవహరిస్తోంది.



ధర్మాసనంలోని ఇద్దరు జడ్జీల వైఖరి ఎవరికీ అంతుబట్టడంలేదు. పైగా ఒక జడ్జీ కేఎం జోసెఫ్ జూన్ 16వ తేదీన రిటైర్ అవబోతున్నారు. అందుకనే రిటైర్మెంట్ ముందు హడావుడిగా కేసు విచారణ చేపట్టేది లేదని తీరిగ్గా మంగళవారం చెప్పారు. మరి ధర్మాసనంలోకి జోసెఫ్ స్ధానంలో కొత్తగా ఎవరొ రావాల, ఆయనకు కేసు పూర్వపరాలు అర్ధమవ్వాలి, తర్వాత విచారణ జరపాలి, ఆ తర్వాత కదా తీర్పుచెప్పేది. ఇదంతా అయ్యేటప్పటికి ఎన్నికలు కూడా వచ్చేస్తాయోమో అనిపిస్తోంది. మరి జూలై 11వ తేదీన విచారణలో ఏమిజరుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: