ఇజ్రాయెల్: తీవ్ర ఉద్రిక్తత.. పెద్ద ఎత్తున ఆందోళనలు?

Purushottham Vinay
ఇజ్రాయెల్: ఇజ్రాయెల్  దేశంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధాని అయిన బెంజిమన్ నేతన్యాహూకు వ్యతిరేకంగా ఆ దేశంలో చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి.వేలాది మంది ఇజ్రాయెల్ ప్రజలు కూడా నిరసన బాట పట్టారు.ఇజ్రాయిల్ దేశపు జెండాలు పట్టుకొని భారీ ర్యాలీగా తరలివచ్చి తమ గళం వినిపించారు.ఇక న్యాయవ్యవస్థలో సంస్కరణల పేరుతో తనను తాను కాపాడుకోవాలని చూస్తున్న ప్రధానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ నినాదాలు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంకా సైనికులు వారిపై భాష్పవాయువు గోళాలు ప్రయోగించి చెదరగొట్టారు. అయితే ఇటీవల ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఇంకా న్యాయమూర్తులకు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. దీంతో ఓ అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాని బెంజిమన్ జైలు శిక్ష పడకుండా తనను తాను కాపాడుకునేందుకు న్యాయవస్థలో సంస్కరణల పేరుతో మార్పులు చేయాలనుకుంటున్నారు.

అయితే ఇందులో జడ్జీల నియామకం ఇంకా ప్రభుత్వం జారీ చేసిన చట్టాలను రద్దు చేసే అధికారాన్ని కోర్టులకు లేకుండా చేయడం లాంటి విధానాలు అనేవి ఈ సంస్కరణల్లో ఉన్నాయి. అయితే దీన్ని అమలు చేయవద్దని చెప్పిన రక్షణ మంత్రిని కూడా బెంజిమన్ నెతన్యాహూ ఇటీవల పదవి నుంచి తొలగించారు.రక్షణమంత్రికి మద్దతుగా ఇంకా అలాగే న్యాయవ్యవస్థలో సంస్కరణలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ప్రజలు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చారు. ఆందోళనలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాన ఎయిర్‌పోర్టులో విమాన సేవలను కూడా అక్కడి అధికారులు నిలిపివేశారు. ఎయిర్‌ పోర్టు వర్కర్క్‌ యూనియన్ సోమవారం నాడు సమ్మెకు పిలుపునివ్వడంతో ఈ నిర్ణయంని తీసుకున్నారు.ఇజ్రాయెల్ కి అతిపెద్ద ట్రేడ్ యూనియన్ సమ్మెకు దిగడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే ఛాన్స్ కూడా ఉంటుంది.ఇజ్రాయెల్ లో ఇలాంటి గొడవలు కొత్తేమి కాదు. ఈ దేశం ఏర్పడిన దగ్గర నుంచి పొరుగు ముస్లిం దేశాలతో ఎన్నో గొడవలు, యుద్దాలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: