మన దేశంలో ఆన్లైన్ షాపింగ్ రోజు రోజుకు పెరిగి పోతుంది..ఒకదానికి మించి మరొకటి వస్తున్నాయి.ఇక పండుగలకు భారీ డిస్కౌంట్ లను అందిస్తున్నారు..ఈ మేరకు తాజాగా ఫ్లిప్కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ ప్రారంభించింది..ఈ మధ్య పండుగల సమయంలో కూడా వరుస ఆఫర్లను అందించింది. ప్రతి పండుగకు భారీ సేల్ ను అందించింది. ఇప్పుడేమో ఏకంగా ఇయర్ ఎండ్ సేల్ ను ప్రారంభించారు..ఈ సేల్ ను డిసెంబర్ 24న ప్రారంభమై డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది. శాంసంగ్, Apple, Oppo మొదలగు టాప్ బ్రాండ్ ఫొన్ల పై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. కాగా, నథింగ్ ఫోన్ పై అదిరిపోయే ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.ఈ సేల్లో భాగంగా స్మార్ట్ఫోన్ను రూ. 25,999 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 8GB +128GB వేరియంట్.. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో రూ. 27,999 వద్ద అందుబాటులో ఉంది.
ఇకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 2వేల వరకు 10శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ ధర రూ. 25,999కి తగ్గుతుంది. ఫ్లిప్కార్ట్ 97 యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఫోన్ కొనుగోలుపై 5శాతం క్యాష్‌బ్యాక్ ను పొందవచ్చు. నథింగ్ ఫోన్ (1) ఫోన్ని కొనుగోలుపై ఆసక్తి ఉన్నవారు No-Cost EMIని కూడా ఎంచుకోవచ్చు. ఇక నో-కాస్ట్ EMI నెలకు రూ. 4,334 నుంచి ప్రారంభమవుతుంది..
ఈ ఫోన్ల ఫీచర్లు..బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. నథింగ్ ఫోన్ (1) వినూత్న గ్లిఫ్ ఇంటర్ఫేస్ కలిగి ఉంది. ఈ స్క్రీన్ సమయాన్ని తగ్గించడంలో యూజ్ అవుతుంది.. కమ్యూనికేట్ చేసేందుకు కొత్త మార్గంగా చెప్పవచ్చు. ఎవరైనా కాల్ చేసినా ఇండికేట్ సూచిస్తాయి యాప్ నోటిఫికేషన్లు, ఛార్జింగ్ స్టేటస్ సూచిస్తాయి. 50 mp సెన్సార్లను కలిగిన డ్యూయల్ కెమెరాను కలిగి ఉంది. ప్రధాన కెమెరా ఫ్లాగ్షిప్ సోనీ IMX766 ద్వారా పనిచేస్తుంది..ఇంకా మరెన్నో ఫీచర్లను కలిగి ఉంటుంది.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఈ నెల 31వరకు మాత్రమే ఈ ఆఫర్లు..