గోదావరి : పవన్ పరువు తీసేసిన పెదకాపు

Vijaya




సరిగ్గా వైజాగ్ లో కాపునాడు బహిరంగసభ ముందు పెదకాపుల్లో ఒకరిగా పాపులరవుతున్న రామ్మోహన్ రావు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరువు తీసేశారు. విశాఖలో కాపునాడు బహిరంగసభ ఏర్పాట్ల సందర్భంగా మీడియాతో మాట్లాడుతు పవన్ నాయకత్వం వల్ల కాపులకు ప్రత్యేకంగా ఒరిగేదేమీ ఉండదని తేల్చేశారు. సినిమా వాళ్ళలో లేకపోతే ఏదో ఒక పరిశ్రమకు చెందిన వాళ్ళను నమ్ముకుని రాజకీయం చేయటం కాపులకు సాధ్యంకాదని కుండబద్దలు కొట్టకుండానే చెప్పేశారు. కాపులకు ప్రత్యేక పార్టీ ఉండాలని ప్రయత్నిస్తున్న వాళ్ళల్లో ఈయన కూడా ఒకరు.





కులంలో సమిష్టి నాయకత్వం వచ్చినపుడు, తమకులానికి మంచి జరగాలని అందరు సమిష్టి నిర్ణయం తీసుకున్నపుడు మాత్రమే కాపులకు ఏమైనా మంచి జరిగే అవకాశముందని స్పష్టంగా ప్రకటించారు. కులంలో మంచి నాయకత్వం ఉన్నపుడు మాత్రమే సామాజికవర్గానికి మంచి జరుగుతుందని తేల్చేశారు. కాపులు బీసీల రిజర్వేషన్ కోసం పోరాటాలు చేయకూడదని కూడా అభిప్రాయపడ్డారు. బీసీల రిజర్వేషన్లో తమకూ భాగస్వామ్యం కావాలని కాపుల్లో కొందరు డిమాండ్ చేయటం వల్లే బీసీలతో కాపులకు వైరం వచ్చిందని గుర్తుచేశారు.





రామ్మోహన్ చెప్పింది విన్నతర్వాత పవన్ వల్ల కాపులకు ఎలాంటి మేలు జరగకపోగా నష్టం గ్యారెంటీ అని అర్ధమవుతోంది. ఎందుకంటే మాటమీద నిలకడలేని తత్వం, విషయ పరిజ్ఞానం లేకపోవటం, అసందర్భంగా నోటికొచ్చింది మాట్లాడేసి పూనకం వచ్చినవాడిలాగ ఊగిపోవటమే పవన్ లక్షణాలుగా బ్రాండ్ పడిపోయాయి. ఒకసారి తాను అందరివాడినంటారు. మరోసారి తనకు కులభావన లేదంటారు. ఇంకోసారి అన్నీకులాల్లోను కులభావన ఉండాలంటారు.





మొత్తానికి పవన్ మాటల వల్ల అందరిలాగే కాపుల్లో కూడా అయోమయం పెరిగిపోతోంది. తాను కాపు ప్రముఖుడిగా ముద్రవేయింకోవటానికి పవన్ భయపడుతున్నారు. తనపైన కాపునేతగా ముద్రపడితే మిగిలిన సామాజికవర్గాలు ఎక్కడ దూరమవుతాయో అనే భయం కనబడుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే పవన్ అంటే కాపులందరిలో ప్రత్యేకమైన అభిమానం ఏమీలేదు. అలాగని మిగిలిన కులాల్లో కూడా పవన్ పట్టించుకుంటున్న వాళ్ళు లేరు. ఎంతసేపు అభిమానసంఘాల్లోని వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు పట్టించుకుటుంన్నదే లేదు. అందుకనే ఎవరికీ కాకుండా పోతోంది జనసేన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: