పొదుపు పథకాల్లో పోస్టాఫీసు బెస్ట్..ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తుంది..ఇందులో పన్ను ఆదా పథకంతో పాటు రుణ పథకం సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. సురక్షితమైన పెట్టుబడితో మంచి లాభాలను సంపాదించడానికి మీరు పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మీరు ప్రతి నెలా కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందాలనుకుంటే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఉత్తమ పథకం. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అనేది ఒక ప్రసిద్ధ పథకం. ఇందులో పెట్టుబడిని కేవలం రూ.100 నుంచి ప్రారంభించవచ్చు.
ఈ పథకం కింద ప్రభుత్వం 5.80 శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఇది ఏప్రిల్ 2020 నుండి వర్తిస్తుంది. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం కింద భారతీయ పౌరుడు ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల పాటు డబ్బును డిపాజిట్ చేయవచ్చు.మూడు నెలల తర్వాత కాంపౌండ్ రేటుతో మీ ఖాతాలో జమ చేయబడుతుంది. మీరు ఈ పథకం కింద డబ్బు డిపాజిట్ చేయాలనుకుంటే, మీరు సమీపంలోని ఏదైనా పోస్టాఫీసుకు వెళ్లి డిపాజిట్ చేయవచ్చు..
అలాగే..ఆర్డీ పథకం కింద ఒక ఖాతాదారుడు ప్రతి నెలా రూ.10,000 పెట్టుబడి పెడుతూ ఈ పెట్టుబడిని 10 సంవత్సరాల పాటు చేస్తే అతను మొత్తం 16 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకుంటాడు. అలాగే ప్రతి నెలా 10 వేలు డిపాజిట్ చేస్తున్నారంటే ఏడాదికి లక్షా 20 వేల రూపాయలు అవుతుంది. అదేవిధంగా 10 సంవత్సరాలలో మీకు సుమారు 12 లక్షల డిపాజిట్ ఉంటుంది. మరోవైపు వడ్డీ రూపంలో 4 లక్షల 26 వేలకు పైగానే రాబడి వస్తుంది. అంటే ఈ పథకంలో 10 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేసే వారికి రూ.16 లక్షల పైగా వస్తుంది..18 ఏళ్ల వ్యక్తులు ఎవరైనా డబ్బును డిపాజిట్ చేయవచ్చు. కానీ మైనర్ పిల్లలు ఉంటే తల్లిదండ్రుల సంరక్షణలో ఈ పథకాన్ని తీసుకోవచ్చు. ఒక సంవత్సరం పాటు ఈ పథకంలో డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత దానిపై రుణ సౌకర్యం కూడా పొందవచ్చు. 50% వరకూ రుణం కూడా పొందే అవకాశం ఉంది..