మెగా బ్రదర్ పై శివభక్తులు ఫైర్.. కారణం ఏంటంటే?
చిత్ర పరిశ్రమలో అన్నయ్యకు అండగా ఉండే నాగబాబు.. రాజకీయాల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ కి అయితే ఒక సైనికుడిగా పనిచేస్తుంటాడు. సినిమానుండి రాజకీయాల్లోకి వెళ్లి జనసేన పార్టీతో ఆంద్ర ప్రదేశ్ లో పాలిటిక్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీ నుండి గట్టి సపోర్టుగా ఎవరు లేరు. అప్పుడప్పుడు బండ్ల గణేష్ లాంటివాళ్లు వైసిపికి కౌంటర్లు ఇచ్చినా.. సినిమా ఒప్పుకోవటం లేదని పవన్ కి మద్దత్తుని తగ్గించేసాడు బండ్ల గణేష్. ఈ నేపథ్యంలో తమ్ముడికి అండగా నాగబాబు నిలుస్తున్నాడు.. అయిన బాబు మాత్రం ఆగడు..
జనసేన ప్రధాన ప్రత్యర్థి అయిన వైసీపీని సోషల్ మీడియాలో పదునైన పదజాలంతో విమర్శిస్తూ జనసైనికులకి జోష్ ఇస్తాడు నాగబాబు. ఈ సందర్భంగా తాజాగా తన రాజకీయ విమర్శల్లో ఏకంగా పరమశివుడిని కూడా లాగేశాడు నాగబాబు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో పురాణాల్లో చెప్పిన శివుడి కథను వల్లించారు నాగబాబు. జగన్ ని భస్మాసురుడిగా పోలుస్తూ పరమశివుడి సామెతని పంచుకున్నాడు నాగబాబు. భస్మాసురుడు శివుడి వరంతో ఎవరి తల మీద అయినా చెయ్యిపెడితే భస్మం అవ్వాలని కోరుకున్నాడు. కానీ తనకి వరం ఇచ్చిన శివుడి మీద ప్రయోగించాలని చూసాడు.
విష్ణు మూర్తి ఉపాయంతో శివుడు బ్రతికాడు, భస్మాసురుడు చచ్చాడు. కానీ, శివుడికి మాత్రం భయం పోలేదు. భస్మాసురుడు మళ్ళీ ఎక్కడ పుడతాడో అని. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భస్మాసురుడు మళ్ళీ పుట్టాడు. జనాలని భస్మం చెయ్యటానికి. ఓ విష్ణు దేవా ఈ జనాల్లో మళ్ళీ పుట్టిన శివుడిని కాపాడు అని నాగబాబు జగన్ ని పరోక్షంగా విమర్శిస్తూ ట్వీట్ చేశాడు. అయితే.. శివుడు భయపడ్డాడని నాగబాబు పేర్కొనడంపై నెటిజన్లు మండి పడుతున్నారు. నీకు తెలిసింది చెప్పకు..పూర్తిగా వస్తే చెప్పు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది..