అమరావతి : పవన్ను బీసీలు సరే కాపులైనా నమ్ముతారా ?

Vijaya






వచ్చే ఎన్నికల్లో జనసేనకు మద్దతుగా నిలబడే సామాజికవర్గం ఏదైనా ఉందా ? ఇపుడిదే కీలకమైన ప్రశ్న. ఎందుకంటే మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో తూర్పుకాపులతో పవన్ మాట్లాడుతు వచ్చేఎన్నికల్లో తనకు ఓట్లేయమన్నారు. జనసేనకు ఓట్లేసి గెలిపిస్తే తూర్పుకాపుల సమస్యను ఒకే ఒక్క సంతకంతో పరిష్కరించేస్తానని హామీఇచ్చారు. బీసీలంతా ఐకమత్యంతో, ఓట్లు చీలకుండా జనసేకు ఓట్లేయాలట. అప్పుడు తాను సీఎం అయిన తర్వాత బీసీల సమస్యలన్నింటినీ తీర్చేస్తారట.




ఓట్లు చీలిపోవటం వల్లే  బీసీలకు రాజ్యాధికారం దక్కటంలేదని పవన్ బోల్డు బాధపడిపోయారు. ఓట్లుచీలకుండా బీసీలు గనుక చూసుకుంటే పదేళ్ళల్లో రాజ్యాధికారం వచ్చేయటం ఖాయమని జోస్యం కూడా చెప్పారు. అంతా బాగానే ఉంది  జనసేనకు బీసీలు ఓట్లేసి గెలిపిస్తే పవన్ ముఖ్యమంత్రయిపోతారట. అయితే ఇక్కడో విషయాన్ని పవన్ మరచిపోయారు. అదేమిటంటే మొదటినుండీ బీసీలకు కాపులకు పడదు. కాపు సామాజికవర్గానికి చెందిన తనకు బీసీలు ఓట్లువేసి గెలిపిస్తారని పవన్ ఎలాగ అనుకున్నారు ?




ఇక రెండోది బీసీలు ఓట్లేయటం సంగతి పక్కనపెట్టేస్తే అసలు కాపుల్లోనే అందరు ఓట్లేస్తారా ? 2019 ఎన్నికల్లో కాపుల్లోనే చాలామంది జనసేనకు ఓట్లేయని సంగతి తెలిసిందే. నిజంగానే కాపుల్లో అందరు పవన్ కు ఓట్లేసుంటే పోటీచేసిన గాజువాక, భీమవరంలో పవన్ గెలిచుండేవారే. అంటే పవన్ను సొంత సామిజికవర్గం కూడా నమ్మటంలేదని అర్ధమైంది.



సొంత సామాజికవర్గంలోనే ఓట్లు తెచ్చుకోలేని పవన్ రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్న బీసీల ఓట్లు ఎలా పొందగలరు ?  పవనే కాదు 2009లో ప్రజారాజ్యంపార్టీ అధినేతగా పోటీచేసిన చిరంజీవి కూడా పాలకొల్లులో ఓడిపోయారు. అంటే అన్నదమ్ములిద్దరికీ సొంత సామాజికవర్గంలో ఉన్న ఇమేజి, పట్టు ఏమిటో తెలిసింది. కాబట్టి బీసీల సంగతిని పక్కనపెట్టేసి ముందు కాపుల ఓట్లను వేయించుకోవటంపై పవన్ దృష్టిపెడితే బాగుంటుంది. పవన్ రాజకీయానికి బేసే కాపు సామాజివకర్గం. బేసే సరిగాలేకపోతే  2019 ఎన్నికల రిజల్టే రిపీటైనా ఆశ్చర్యంలేదు.  కాబట్టి పవన్ ముందు తాను చేయాల్సింది చేస్తే మిగిలింది జనాలే చేస్తారని గ్రహించాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: