గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే వారసుడి జోరు.. అంతా ఎమ్మెల్యే సీటు కోసమేనా !

VAMSI
ఈ ఆధునిక కాలంలో కెరీర్ ను నిర్దేశించుకుంటున్న వారి తీరు పూర్తిగా మారిపోయింది. కొందరు జాబ్ అంటూ ఫారిన్ దేశాలకు వెళుతూ ఉంటే, మరికొందరు సొంత ఊరిలోనే వ్యాపారాలు పెట్టుకుని స్థిరపడుతున్నారు. ఇంకా యువత సోషల్ మీడియాను సరిగ్గా వాడుకుంటూ సొమ్ము చేసుకుంటోంది. కానీ ఈ రాజకీయ నాయకుల వారసులు ఉన్నారే.. వాళ్ళు మాత్రం ఇష్టం ఉన్న లేకపోయినా పెద్దవాళ్ళ ప్రోద్బలంతో రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇలా తండ్రి , బాబాయ్ , తాత ల పేర్లు చెప్పుకుని రాజకీయాల్లో స్థిరపడినవారిని ఎంతోమందిని చూశాము. అయితే అందరూ సక్సెస్ అవుతారని మాత్రం ఖచ్చితంగా చెప్పలేము.

ఇక కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మరో ఎమ్మెల్యే వారసుడు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల్లో నాయకుడిగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ నాయకుడు ఎవరో ? ఆ ఎమ్మెల్యే ఎవరో ? అన్నది ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి గుంటూరు జిల్లా ఇప్పుడు పల్నాడుకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు జగన్ సూచించిన విధంగా తన నియోజకవర్గంలో గడపగడపకు పాదయాత్ర చేస్త్తున్నారు. పనిలో పనిగా తన కొడుకు బొల్లా గిరిబాబును కూడా వెంటబెట్టుకు వెళుతున్నారట. బ్రహ్మ నాయుడు ఎక్కడకు వెళితే అక్కడకు గిరిబాబును తీసుకుని వెళుతూ ప్రజలకు పరిచయం చేస్తూ... రాజకీయాలను తనకు అలవాటు చేస్తున్నాడట.

ఇక గిరిబాబు సైతం తండ్రి అండతో నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అందరినీ ఆకట్టుకుంటున్నాడట. అలా నియోజకవర్గంలో పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి వరకు ఏదో ఒక విధంగా తండ్రి కొడుకులు ఇద్దరూ ప్రజలకు టచ్ లోనే ఉంటూ వచ్చే ఎన్నికలకు ప్రజలను తమ వైపుకు తిప్పుకుంటున్నారు. అయితే బొల్లా కొడుకు జోరు చూస్తే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కోసమే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. కానీ జగన్ మాత్రం వారసులకు టికెట్ లు ఇచ్చేది లేదని చెప్పియున్నారు. మరి బొల్లా బ్రహ్మనాయుడు ఏమి చేయనున్నారు అన్నది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: