మిస్డ్ కాల్ తో మనీని ఎలా ట్రాన్స్‌ఫర్ చెయ్యాలో తెలుసా?

Satvika
ఆన్లైన్ డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ అవుతున్నాయి.. క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉండటంతో వాటి వాడకం కూడా ఎక్కువ అవుతుంది. మనీ ట్రాన్స్‌ఫర్ చెయ్యడానికి ఇవి చాలా సులువుగా వుంటాయి..అందుకే ఎక్కువ మంది వీటిని వాడుతున్నారు..ఇక పోతే మొబైల్ యాప్స్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా వేరే వాళ్లకు డబ్బులు పంపించొచ్చు. అయితే మిస్డ్ కాల్ ద్వారా కూడా మనీ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.. మిస్డ్ కాల్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ చేసే సర్వీసులు ఉన్నాయి. యూపీఐ ద్వారా ఈ సేవలు పొందొచ్చు. 



మిస్‌కాల్‌పే అనే సంస్థ ఇలాంటి సర్వీసు లు అందిస్తోంది. ఈ సంస్థ తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీఎఫ్‌సీ ఫస్డ్ బ్యాంక్ వంటి వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అంటే ఈ బ్యాంక్ కస్టమ ర్లు మిస్డ్ కాల్ సర్వీసులు పొందొచ్చు.. స్మార్ట్‌ఫోన్స్ ద్వారా క్షణాల్లో యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్లు నిర్వహించొచ్చు. అయితే ఫీచర్ ఫోన్ ద్వారా కూడా యూపీఐ విధానం లో మిస్డ్ కాల్ ద్వారా డబ్బులు పొందొచ్చు. లావా దేవీలు పూర్తి చేయొచ్చు. యూపీఐ123 సిస్టమ్ ద్వారా ఈ మిస్డ్ కాల్ పేమెంట్ సర్వీసులు పని చేస్తాయి..

మిస్‌కాల్‌పే ద్వారా ఫీచర్ ఫోన్ వాడే వారు వారి బ్యాంక్ అకౌంట్‌ను యాక్సెస్ చేయొచ్చు. మనీ ట్రాన్స్‌ఫర్ ఫెసిలిటీ పొందొచ్చు. అలాగే బిల్లు పేమెంట్లు చేయొచ్చు. కేవలం ఒక్క నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. ఈ సేవల కోసం మిస్‌కాల్‌ పే సంస్థ ఎన్‌పీసీఐతో కలిసి పని చేస్తోంది. ఇప్పుడు మనం మిస్డ్ కాల్ ద్వారా లావాదేవీలు ఎలా నిర్వహించాలో తెలుసుకుందాం.



ముందుగా 08066740740 నెంబర్‌కు కాల్ చేయాలి. కాల్ అదే ఆటోమేటిక్‌ గా డిస్‌కనెక్ట్ అవుతుంది. అంతవరకు అలానే ఉండాలి. కాల్ కట్ అయిపోయిన తర్వాత మీ నెంబర్‌కు మళ్లీ కాల్ వస్తుంది. 10 సెకన్లలోనే కాల్ బ్యాక్ రావొచ్చు. ఇప్పుడు మీరు పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ట్రాన్సాక్షన్ పూర్తి అవుతుంది. ఇలా సింపుల్‌గా లావాదేవాలను పూర్తి చేయొచ్చు. తెలుగు సహా 11 భాషల్లో మిస్‌కాల్‌పే సర్వీసులు పొందొచ్చు. అందువల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సులభంగానే ట్రాన్సాక్షన్లు, బిల్లు చెల్లింపులు చెయ్యొచ్చు.. అంతే చాలా సులువుగా అయిపొతాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: