టాలీవుడ్ క్వీన్ కొత్త అడుగు.. తమన్నా వ్యాపారం సోషల్ మీడియాలో ట్రెండ్!

Amruth kumar
వెండితెరపై తన అందచందాలతో, డ్యాన్స్‌లతో కోట్ల మంది మనసు గెలుచుకున్న తమన్నా, ఇప్పుడు డైమండ్స్ మరియు గోల్డ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతం జుహు (Juhu)లో తన సొంత నగల దుకాణాన్ని ప్రారంభించి, అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, ఒక పక్కా ఆంట్రప్రెన్యూర్‌గా మారి తన తండ్రి సంతోష్ భాటియాతో కలిసి ఈ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది.శనివారం జరిగిన ఈ గ్రాండ్ ఓపెనింగ్ ఈవెంట్‌కు టాలీవుడ్ మరియు బాలీవుడ్ నుంచి భారీగా సెలబ్రిటీలు తరలివచ్చారు.ఈ వేడుకలో సమంత రూత్ ప్రభు, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, సిద్ధార్థ్ మల్హోత్రా, మృణాల్ ఠాకూర్ మరియు ఆర్యన్ ఖాన్ వంటి స్టార్స్ మెరిసిపోయారు. ఒకే ఫ్రేమ్‌లో సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లందరినీ చూసిన నెటిజన్లు "ఇది హీరోయిన్ల రీయూనియన్ పార్టీలా ఉంది" అంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.వైట్ ఆఫ్-షోల్డర్ టాప్ మరియు డెనిమ్ జీన్స్‌లో చాలా సింపుల్‌గా, స్టైలిష్‌గా కనిపించిన తమన్నా.. తన సొంత బ్రాండ్ డైమండ్ జ్యువెలరీని ధరించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.



తమన్నా తన బ్రాండ్‌ను "బియాండ్ ది ఒకేషన్" (Beyond the Occasion) అనే ఫిలాసఫీతో ముందుకు తీసుకెళ్తోంది.సాధారణంగా జ్యువెలరీ అంటే కేవలం పెళ్లిళ్లు, పెద్ద ఫంక్షన్లకే ధరిస్తారు. కానీ తమన్నా బ్రాండ్ ప్రత్యేకత ఏంటంటే.. ప్రతిరోజూ ఆఫీసులకు, పార్టీలకు కూడా ధరించేలా చాలా లైట్ వెయిట్ మరియు స్టైలిష్ డిజైన్లను ఆమె స్వయంగా డిజైన్ చేశారు. ముఖ్యంగా జెన్-జీ (Gen Z) యువతను ఆకర్షించేలా ఈ నగలు ఉన్నాయి."తమన్నా తండ్రి సంతోష్ భాటియాకు జ్యువెలరీ రంగంలో దాదాపు 30 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన సహకారంతోనే తమన్నా ఈ వ్యాపారంలోకి దిగింది.ఇందులో Half & Half, The Flick, Plumptious అనే మూడు రకాల ప్రత్యేక కలెక్షన్‌లను విడుదల చేశారు.14K మరియు 18K బంగారంతో పాటు నేచురల్ డైమండ్స్ మరియు రత్నాలను ఉపయోగించి ఈ నగలను తయారు చేశారు.



కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాకుండా, ఫ్యాషన్ మరియు లైఫ్‌స్టైల్ ఐకాన్‌గా ఎదగడమే తమన్నా లక్ష్యం. ఒకవైపు బిజినెస్ చూసుకుంటూనే, మరోవైపు సినిమాల్లో కూడా బిజీగా ఉంది. విశాల్‌తో 'పురుషన్' (తెలుగులో మొగుడు), షాహిద్ కపూర్ సరసన 'ఓ రోమియో' వంటి సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతోంది.తమన్నా కొత్త స్టోర్ ఫోటోలు మరియు వీడియోలు ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. "సినిమా గ్లామర్ బాగుంది.. ఇప్పుడు బిజినెస్ డైనమిక్స్ కూడా అదిరిపోయాయి" అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మిల్కీ బ్యూటీ డిజైన్ చేసిన నగలు చూసి లేడీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.మొత్తానికి తమన్నా భాటియా తన కెరీర్‌లో ఒక కొత్త చాప్టర్‌ను ప్రారంభించింది. గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ముద్ర వేసిన ఈ సుందరి, ఇప్పుడు జ్యువెలరీ రంగంలోనూ డైమండ్‌లా మెరుస్తుందనడంలో సందేహం లేదు. ముంబై జుహులో ప్రారంభమైన ఈ స్టోర్, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా విస్తరించాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: