కిడ్నాప్ కేసులో మంచు ఫ్యామిలీ.. ఏం జరిగిందంటే..?

Divya
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో సినిమాలలో కంటే నిరంతరం ఏదో ఒక వివాదంలో విరి పేరు వినిపిస్తూనే ఉంది. తాజాగా మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు పైన కిడ్నాప్ కేసు నమోదయ్యాయి. కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ నాయకులు అక్బర్, వినోద్ లను కిడ్నాప్ చేశారని మోహన్ బాబు విద్యాసంస్థలకు చెందిన వారే ఈ కిడ్నాప్ చేశారంటూ విద్యార్థి సంఘాలు అనుమానిస్తూ ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు.


ఈ క్రమంలోనే కిడ్నాప్ గురైన ఇద్దరు విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు సైతం చంద్రగిరి ప్రాంతం వద్ద రక్షించారు. ఒక వాహనంతో, పలువురు నిందితులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకొని మరి విచారిస్తున్నట్లు సమాచారం. దీంతో పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు పైన మంచు విష్ణు పైన యూనివర్సిటీ యాజమాన్యం పైన కిడ్నాప్ కేసు నమోదు అయింది. అయితే మోహన్ బాబు యూనివర్సిటీ కూడా విద్యార్థి సంఘాల పైన పోలీస్ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.


తమ యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో చాలా దుష్ప్రచారం చేస్తున్నారని, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ అలాగే ఏఎస్ఐఎఫ్ కార్యదర్శి ప్రవీణ్ ల పైన చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఆ ప్రచారం ఆపాలి అంటే తమ దగ్గర నుంచి రూ .15 లక్షల రూపాయలు డిమాండ్ చేశారని, ఆ డబ్బులు ఇవ్వకపోతే తిరిగి తిరుపతి కలెక్టర్ల వద్ద ధర్నాకు  దిగి  యాజమాన్య దిష్టిబొమ్మను కూడా దహనం చేస్తామంటూ బెదిరించినట్లుగా మోహన్ బాబు యూనివర్సిటీ అధికారుల సైతం ఫిర్యాదులో నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. మరి మొత్తానికి ఈ విషయం పైన మంచు ఫ్యామిలీ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం మోహన్ బాబు, నాని నటిస్తున్న ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: