విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!!
గుడ్ల నాణ్యత దెబ్బతినకుండా వారానికోసారి తాజా గుడ్లను సరఫరా చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం జగనన్న గోరుముద్ద పథకం అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు వారానికి ఐదు ఉడికించిన గుడ్లను మధ్యాహ్న భోజనంగా అందజేస్తున్నారు. కోడి గుడ్లు ప్రతి వారం వివిధ రంగులతో సరఫరా చేయబడుతున్నాయి. తద్వారా నాణ్యమైన గుడ్లు పంపిణీ చేయబడతాయి.
గుడ్లు వరుసగా నెలలో మొదటి వారం నీలం రంగులో, 2వ వారం గులాబీ రంగులో, 3వ వారానికి ఆకుపచ్చ రంగులో, 4వ వారంలో వైలెట్ రంగులో ఉంటాయి. పాఠశాలల్లో ఈ విధంగా వచ్చే గుడ్లనే ప్రధానోపాధ్యాయులు దిగుమతి చేసుకోవాలి. గుడ్ల సైజు తగ్గినా పాఠశాలల్లో గుడ్లు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఐఎంఎంఎస్ యాప్‌లో గుడ్ల సైజు, రంగు స్టాంపింగ్ ఉన్న గుడ్లు, స్టాంపింగ్ లేని గుడ్లు తదితర వివరాలను నమోదు చేయాలని నిబంధన పెట్టారు. విద్యార్థులకు అందించే నాణ్యమైన పౌష్టికాహారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది..మంచి గుడ్లను సరఫరా చేసెందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నారు..